లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఫుల్ జోష్ మీద ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖిలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటించారు. నాగేష్ కుకునూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిచారు. దేవీ శ్రీప్రసాద్ ఈచిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Advertisement
Advertisement
good luck sakhi trailer
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. సినిమాలో జగపతి బాబు ట్రైనర్ గా నటిస్తుండగా కీర్తిసురేష్ షూటర్ గా నటించినట్టుగా కనిపిస్తోంది. ఇక ట్రైలర్ బ్యాగ్రౌండ్ ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. అంతే కాకుండా ట్రైలర్ లో కామెడీ,ఎమోషనల్ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఊర్లో వాళ్లంతా బ్యాడ్ లక్ సఖి అంటూ పిలిచే కీర్తి సురేష్ గుడ్ లక్ సఖిగా ఎలా మారింది అన్నదే సినిమా కథగా కనిపిస్తోంది. మరి ఆకట్టుకునే ట్రైలర్ తో వచ్చిన ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Advertisement