Home » ఆ యాసిడ్‌లో బంగారం వేస్తే…క్ష‌ణాల్లో మాయం…

ఆ యాసిడ్‌లో బంగారం వేస్తే…క్ష‌ణాల్లో మాయం…

by Bunty
Ad

ప్ర‌పంచంలో విలువైన వ‌స్తువుల్లో బంగారం కూడా ఒక‌టి. ప్ర‌పంచంలోని అనేక దేశాలు బంగారాన్ని ఆభ‌రణాల రూపంలో వినియోగిస్తుంటాయి. విలాస వ‌స్తువుగా పేరుపొందిన ఈ బంగారం ధ‌ర కూడా దానికి త‌గ్గ‌ట్టుగా ఉంటుంది. మ‌న‌దేశంలో తులం బంగారం కొనాలి అంటే సుమారు 40 వేల‌కు పైగా డ‌బ్బు పెట్టాల్సి వ‌స్తున్న‌ది. ఇక కొంత‌మంది బంగారాన్ని మెరుగుపెడ‌తామ‌ని చెప్పి కొన్ని రకాల ర‌సాయ‌నాలు వేసి కొద్ది కొద్దిగా దానిని క‌రిగించుకొని వెళ్తుంటారు. బంగారాన్ని మెరుగుపెట్ట‌డం కోసం చాలా మంది హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను వినియోగిస్తుంటారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్‌లో బంగారం ఎలా క‌రుగుతుందో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Advertisement

ఓ గాజు గ్లాసులో స‌గానికి పైగా హెచ్‌సీఎల్ పోసి అందులో బంగారాన్ని వేయాలి. అలా వేసిన త‌రువాత క్ర‌మంగా బంగారం క‌రుగుతుంది. ఆ బంగారానికి కాస్త షైన్ వ‌స్తుంది. అయితే, ఆ హెచ్‌సీఎల్‌లో కాస్త నైట్రిక్ యాసిడ్ క‌ల‌ప‌గానే కొన్ని గంట‌ల్లో పూర్తిగా ఆ బంగారం క‌రిగిపోయింది. చాలామంది బంగారాన్ని ఇలా మాయం చేస్తుంటారు. కాబ‌ట్టి ప్ర‌జ‌లు ఇలాంటి విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. బంగారాన్ని మెరుగుపెట్టే స‌మ‌యంలో వాళ్లు ఎలాంటి యాసిడ్స్‌ను వినియోగిస్తున్నారో త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. షైనింగ్ కోసం ఆశ‌ప‌డి కొంత‌మంది పాపం వారి బంగారం మొత్తాన్ని ఇలా పోగొట్టుకుంటుంటారు. దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న‌ది.

Visitors Are Also Reading