Home » Ram Charan : ఆర్ఆర్ఆర్ టీమ్‌కు బంగారు నాణేలు

Ram Charan : ఆర్ఆర్ఆర్ టీమ్‌కు బంగారు నాణేలు

by Anji
Ad

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగ.. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టారు. ఈ సినిమా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా అటు హిందీ బెల్ట్ లోను సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Advertisement

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు బంగారాన్ని బహుమతిగా ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ కోసం పనిచేసిన కెమెరా అసిస్టెంట్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్లు, మేనేజర్లు, అకౌంటెంట్లు, ఫోటోగ్రాఫర్లు.. ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన 35 మందిని తన ఇంటికి పిలిచి.. ఆప్యాయంగా మాట్లాడారు.ఆ తర్వాత వారందరికీ ఒక్కోతులం గోల్డ్ కాయిన్స్ ను బహుమతిగా అందించారు.


అంతేకాదు కేజీ స్వీట్ బాక్స్ ఇచ్చారట రామ్ చరణ్. ఇలా గత మూడు సంవత్సరాలుగా ఆర్ ఆర్ ఆర్ కోసం కష్ట పడిన వారిని పిలిచి ఆప్యాయంగా మాట్లాడడం.. గిఫ్టులు ఇవ్వడం పట్ల రామ్చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా గతంలో అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా హిట్ సాధించిన అనంతరం తన చిత్ర బృందానికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement


ఇక ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్చరణ్ లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు గ్రాస్ ను అందుకుంది. దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.


మ‌రోవైపు ఆర్ఆర్ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్ లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 15 మిలియన్ డాలర్స్ ను వసూలు చేసి మరో రికార్డు క్రియేట్ చేసింది. హిందీలో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ తో పూర్తిచేసుకుని ఇక రెండో వారంలో అడుగుపెట్టింది.

ఇక మ‌రోవైపు ఈ సినిమా ఐమాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుద‌ల కాలేదు. ఆర్ఆర్ఆర్ న‌టులు విష‌యానికొస్తే.. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు జంట‌గా ఇంగ్లీష్ న‌టి ఓలివియా మోరీస్‌, హిందీ న‌టి ఆలియా భ‌ట్ న‌టించారు. అజ‌య్ దేవ‌గ‌న్ క‌థ‌ను మ‌లుపు తిప్పే కీల‌క పాత్ర పోషించారు.

Visitors Are Also Reading