Home » పాలిటిక్స్ లోకి వెళ్తే jr:ఎన్టీఆర్ కు జరిగేది అదేనా..కారణం..!!

పాలిటిక్స్ లోకి వెళ్తే jr:ఎన్టీఆర్ కు జరిగేది అదేనా..కారణం..!!

by Sravanthi
Ad

నందమూరి ఫ్యామిలీకి రాజకీయాలను పరిచయం చేసింది ఎన్టీఆర్. సినిమాల్లో చక్రం తిప్పిన ఆయన రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాన్ని ఏలారు. ఆయన తర్వాత అంతటి ఘనత నందమూరి ఫ్యామిలీలో సాధించిన వారు లేరని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది నందమూరి అభిమానులు రాజకీయాల్లో మళ్ళీ రాణించాలంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళే అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఈ తరుణంలోనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలు కలిసి రావని అంటున్నారు.. పూర్తి వివరాలు చూద్దాం..

Advertisement

 

ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా పాన్ ఇండియా హీరోగా మారారు ఎన్టీఆర్. అప్పట్లో నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ కి ఏమాత్రం సపోర్ట్ ఇవ్వలేదు. అయినా వెనక్కి తగ్గకుండా అన్ని దిగమింగుకొని వారు నన్ను దగ్గరికి తీయకున్నా అది నా ఫ్యామిలీ అంటూ ముందుకెళ్లారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయాన స్టార్ హీరో అయి తాత పేరు నిలబెట్టే మనవడిగా దూసుకుపోతున్నారు. అలాంటి ఎన్టీఆర్ సినిమాల పరంగా తాత పేరు నిలబెడుతున్నారు కానీ, మరి రాజకీయపరంగా రాణిస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది. అయితే 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేశారు.

Advertisement

టిడిపి పార్టీ తరపున ప్రచారం చేశాక మరికొన్ని రోజులు ఎలక్షన్ అదే టైంలో ఉగాది పండుగ వచ్చింది. ఉగాది పండుగ కోసం జూనియర్ ఎన్టీఆర్ తన సొంత ఊరు వెళ్లడానికి బయలుదేరిన టైం లో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డారు. దింతో అప్పటినుంచి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆ సమయం నుంచే సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాలు కలిసి రావనె ప్రచారం సాగుతోంది. రాజకీయ ప్రచారానికి వెళ్తేనే యాక్సిడెంట్ గురయ్యారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి కాస్త వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. దీంతో నందమూరి అభిమానులు కూడా ఆయన రాజకీయాల్లో కంటే సినిమాల్లో ఉంటే మంచిది అంటూ కామెంట్ పెడుతున్నారు.

also read:

Visitors Are Also Reading