మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అందుకు తగినట్టుగా ప్రమోషన్స్ వేగవంతం పెంచేశారు. ఇటీవలే సినిమా టీజర్, ఫస్ట్ సింగ్‌ను విడుదల చేశారు. అదేవిధంగా మెగాస్టార్ వాయిస్ కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
Advertisement
Also Read : రికార్డు సృష్టించిన బాలయ్య.. చెన్నకేశవరెడ్డికి భారీ కలెక్షన్లు..!
Ad
మెగాస్టార్ నటించిన గాడ్‌ఫాదర్ సినిమాకు బయ్యర్లు దొరకడం లేదనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్నేళ్ల చిరంజీవి కెరీర్‌లో బయ్యర్లు ఎగబడటమే తప్ప బయ్యర్లు వెనుకంజ ఎప్పుడు వేయలేదు. కానీ గాడ్‌ఫాదర్ సినిమాకు బయ్యర్లు వెనుకంజ వేయడం మొదటి సారి. ఇందుకు ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ కావడమే ఒక కారణమని కూడా చెబుతున్నారు. ఈ సినిమాను అన్ని ఏరియాలకు సంబంధించి సొంతంగా విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం కొన్ని కీలకమైన ఏరియాలను వేరే వాళ్లు తీసుకొని విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో కొన్ని సమస్యలు వచ్చాయని, స్వయంగా రామ్ చరణ్ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించినట్టు తెలుస్తోంది.
Also Read : పొన్నియిన్ సెల్వన్ లో త్రిష ధరించిన నగల చరిత్ర గురించి మీకు తెలుసా ?
గాడ్ ఫాదర్ సినిమా విడుదల వ్యవహారం రెండు, మూడు రోజుల నుంచి అంతా చర్చనీయాంశంగా మారింది. డిస్ట్రిబ్యూషన్ విషయంలో దిల్‌రాజుకు మెగాక్యాంప్‌నకు మధ్య పొరపొచ్చాలు వచ్చాయని.. దీంతో నైజాం ఏరియాని కొత్త వారు ఫ్యాన్సీ ఆఫర్‌తో తీసుకున్నారు. వారికి థియేటర్స్ నెట్ వర్క్ లేకపోవడంతో ఏషియన్ సునీల్‌కి అప్పగించారు. ముఖ్యంగా గాడ్‌ఫాదర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని థియేటర్ సమస్యకు దారి తీసిందని సమాచారం.
Also Read : గండిపేటలో అల్లు అర్జున్ కొత్త ప్రాపర్టీ విలువ ఎంతో తెలుసా..?
తొలుత తమిళ డబ్బింగ్ సినిమా పొన్నియన్ సెల్వన్ కు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ కేటాయించారు. ఆ థియేటర్ కావాలని గాడ్ ఫాదర్ టీమ్ భావించింది. ఇదంతా తెలుసుకున్న రామ్ చరణ్ కోపం తెచ్చుకున్నారట. స్వయంగా రంగంలోకి దిగి మాట్లాడిన తరువాత సమస్య పరిష్కారమైందట. రామ్ చరణ్ జోక్యంతో సమస్య సద్దు మణిగి గాడ్‌ఫాదర్‌కు సుదర్శన్ థియేటర్ కేటాయించారట. పొన్నియిన్ సెల్వన్‌కి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని దేవీ థియేటర్‌కు మార్చారని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవి బాడీగార్డ్ కనిపించే రోల్ ఇది. ఈ సినిమా మొత్తం సల్మాన్ ఉండరు. ఒక యాక్షన్ సీన్‌లో ఆయన క్యారెక్టర్ ని హైలెట్ చేసి చూపించబోతున్నారు. ఈ చిత్రాన్ని మెగాస్టార్ సతీమణి కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. ఆర్.బీ.చౌదరి, ఎన్‌వీప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Advertisement
Also Read : మహేష్-త్రివిక్రమ్ సినిమాకి టైటిల్ ఖరారు..!