Home » నూతన సంవత్సరంలో ఈ మూడు రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం.. ఏడాది మొత్తం వారికి డబ్బే డబ్బు..!

నూతన సంవత్సరంలో ఈ మూడు రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం.. ఏడాది మొత్తం వారికి డబ్బే డబ్బు..!

by Anji
Ad

సాధారణంగా ప్రతీ ఏడాది కొత్త సంవత్సరం రావడం తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే 2022 సంవత్సరానికి స్వస్తీ పలికి 2023లోకి అడుగు పెట్టనున్నాం. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం రాకకోసం ఎదురుచూస్తున్నారు. నూతన సంవత్సరంలో తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు.  కొత్త సంవత్సరంలో ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ధనలాభం, ఆర్థిక స్థితి, ఆరోగ్యానికి సంబంధించి ఇలా పలు సమస్యలు గ్రహాల కదలికపై ఆధారపడి ఉంటాయి. 2023లో గ్రహాల గమనంలో చాలా మార్పులు సంభవించనున్నాయి. శని మొదటి రాశి గమనాన్ని మార్చుకుంటుంది. ఆ తరువాత ఏప్రిల్ లో బృహస్పతి, అక్టోబర్ రాహు-కేతువులు మారుతాయి. గ్రహాలు కూడా తమ రాశులకు అనుగుణంగా మార్చుకుంటాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. 2023 సంవత్సరం ఈ 3 రాశుల వారికి చాలా విశిష్టమైంది. నూతన సంవత్సరంలో ఈ మూడు రాశుల వారిపై లక్ష్మిదేవి అనుగ్రహం తప్పక ఉంటుంది. ఆర్థికంగా వీరు లాభాలను అర్జిస్తారు. 2023లో ఆ అదృష్ణ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

మేషరాశి 

రాశులన్నింటిలోకెల్లా మేష రాశి మొదటిది. 2023లో నక్షత్రాల కలయిక కారణంగా మేష రాశి వారిపై ఏడాది పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. శనీశ్వరుడు ఈ ఏడాది మేషరాశిలో 11వ ఇంట్లో సంచరిస్తాడు. 11వ ఇల్లు ఆదాయం, లాభంగా పరిగణించబడుతుంది. ఈ రాశి వ్యక్తులు తమ రంగంల పని చేస్తూ ఆదాయాన్ని పొందుతారు. అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలను కూడా దక్కించుకుంటారు. అంతేకాదు.. కొత్త ఏడాదిలో ఈ రాశి వారి పూర్వికుల ఆస్తిలో దేనినైనా విక్రయించడం ద్వారా లాభాలు అర్జిస్తారు. వ్యాపారస్తులు ఏడాది పొడవునా లాభాలు పొందే అవకాశముంది. వైవాహిక జీవితం, ప్రేమ వ్యవహారాలకు కూడా 2023 అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. 

మకర రాశి 

Advertisement

బృహస్పతి, శని సంచారంతో మకర రాశి వారికి ఓ వరం కంటే తక్కువ ఏం కాదు. 2023లో అన్ని శుభ గ్రహాల మద్దతు పొందుతారు. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదంతో మకర రాశి వారి జీవితంలో అన్ని రకాల సంతోషాలు, సంపదలు లభిస్తాయి. 2023 సంవత్సరం కచ్చితంగా ఈ రాశి వారికి సంఘంలో గౌరవం, మంచి స్థానం లభిస్తుంది. జనవరిలో శని దేవుడు వీరి జాతకంలో రెండో ఇంట్లోకి తొలుత సంచరిస్తాడు. వీరు చేసే ప్రసంగం, తెలివి తేటల సామర్థ్యంతో సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించడంలో విజయం సాధించే అవకాశముంటుంది. సంవత్సరంలో ఈ రాశి వారు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలను పొందుతారు. విద్యార్థుల విషయానికి వస్తే.. ఈ ఏడాది వీరికి విజయాల సంవత్సరం అనే చెప్పవచ్చు. మకర రాశి శని అర్థసగం చివరి దశ అవుతుంది. ఏలిన నాటి శని చివరి దవకు చేరుకోవడంతో ఈ రాశివారికి శనీశ్వరుడు పెద్దగా ఇబ్బంది కలిగించడు. మొత్తానికి ఈ ఏడాది మకర రాశివారికి కావాల్సినవన్ని సమకూర్చుతుంది. 

Also Read :   Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు వర్షానికి అస్సలు బయటికి వెళ్లకూడదు

ధనుస్సు రాశి 

Dhanassu Rasi

కెరీర్ లో ఈ ఏడాది ధనుస్సు రాశి వారు అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. ఆర్థిక కోణం నుంచి చూస్తే.. ఏడాది మొత్తం మంచి సంవత్సరంగా ఉంటుంది. ఈ ఏడాది వీరికి డబ్బుకు ఎలాంటి కొదవ ఉండద. వ్యాపారస్తులు వ్యాపారంల మంచి విజయాలను సాధిస్తారు. కుంభరాశిలోకి శని సంచరించడం వల్ల ధనుస్సు రాశి వారికి ఏలిన నాటి నుంచి శని విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ ఈ ఏడాదిలో పూర్తవుతాయి. ప్రతిచోట ఈ రాశి గల వ్యక్తులు చేపట్టిన పనుల గురించి చర్చించాల్సి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రాశి వారిపై ఉంటుంది. మొత్తానికి ఈ నూతన సంవత్సరం ఈ మూడు రాశుల వారికి సంతోషంగా, ప్రశాంతంగా గడిచిపోతుందని చెప్పవచ్చు. 

Also Read :  Weekly Horoscope in Telugu 2022 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో విజయాలు సాధిస్తారు

Visitors Are Also Reading