ఎక్కువమంది సినిమా లవర్స్ ఫేవరెట్ చిత్రాలలో గీతాంజలి కూడా ఒకటి. మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాగార్జున కు జోడీగా గిరజ హీరోయిన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని ఇప్పటికీ టీవీలో వచ్చినా కూడా ప్రేక్షకులు మిస్ కాకుండా చూస్తారు.
Advertisement
అయితే గీతాంజలి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి హీరోయిన్ గిరిజకు ఎంతో గుర్తింపు వచ్చినప్పటికీ ఆమె ఆ తరవాత రెండు మూడు సినిమాల్లో మాత్రమే కనిపించింది. ఆ తరవాత సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అయితే గిరిజ బ్యాగ్రౌండ్ తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. అసలు గిరిజ ఇండియాలో జన్మించలేదు ఇక్కడ పెరగలేదు. ఇంగ్లాండ్ లోని ఎక్స్ ఎక్స్ అనే ప్రాంతంలో జన్మించడంతో పాటూ అక్కడే పెరిగింది.
Advertisement
గిరిజ తండ్రి డాక్టర్ కాగా ఆమె తల్లి ఓ వ్యాపారవేత్త…..ఈ అందాల రాశి భరతనాట్యం నేర్చుకునేందుకు చెన్నైకి వచ్చినప్పడు కృష్ణమాచారి శ్రీకాంత్ అనే మాజీ ఇండియన్ క్రికెటర్ ద్వారా దర్శకుడు మణిరత్నంకు సుహాసినిల పెళ్లికి హాజరయ్యారు. ఆ పెళ్లిలో మణిరత్నం సోదరుడు జీని గిరిజ అందాన్ని చూసి సినిమాల్లో నటిస్తారా అని అడిగారు.
దాంతో వెంటనే గిరిజ నటిస్తానని చెప్పారు. దాంతో గీంతాంజలి సినిమా కోసం గిరిజను స్క్రీన్ టెస్ట్ చేశారు. అలా గీతాంజలి సినిమాలో గిరిజ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా తరవాత గిరిజ బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఓ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ తరవాత తెలుగలో ఓ సినిమా మలయాళంలో ఓ సినిమా చేయగా అవి కూడా మంచి ఫలితాలను ఇచ్చాయి. కానీ ఆ తరవాత గిరిజ తిరిగి ఇంగ్లాండ్ కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.