మానవత్వం అనేది మంటలో కలిసిపోతున్నది. అన్న, చెల్లి, తమ్ముడు, తల్లి, తండ్రి ఇలా ఎవరినైనా సరే హత్య చేయడానికి వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో నగరంలో చోటు చేసుకున్నది. ప్రియుడితో ప్రేమ కొనసాగించవద్దు అని తండ్రి చెప్పడంతో ఏకంగా కన్నతండ్రినే హత్య చేయించినది బాలిక. ఇంతటి దారుణమైన ఘటన కుషాయిగూడలో జరిగినది. తండ్రిని చంపించేందుకు సుఫారీ ఇచ్చి మరీ హత్య చేయించింది ఆ బాలిక. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జులైలో చోటు చేసుకున్నది.
Advertisement
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ మీడియాకు వివరాలను వెల్లడించారు. పల్సం రామకృష్ణ (49), భార్య కూతురుతో కలిసి కాప్రాలో నివాసం ఉంటున్నారు. ఆయన గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం చేసేవాడు. ఈ తరుణంలో గత జులై 20న తలకు బలమైన గాయాలు కావడంతో రామకృష్ణను ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. తొలుత ఓ ప్రయివేటు ఆసుపత్రి తరలించి, ఆ తరువాత మరో ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో జారిపడి తలకు గాయం అయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించడంతో తనదైన శైలిలో పోలీసులు విచారించారు.
పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడి కావడంతో పోలీసులు దాని ప్రకారం దర్యాప్తును ప్రారంభించారు. ముఖ్యంగా రామకృష్ణ గొంతు నులిమి చంపారని, బలంగా కొట్టడం ద్వారా గాయాలు అయినట్టు నివేదికలో వైద్యులు ధృవీకరించారు. అనుమానం వచ్చి మృతుని భార్య, కుటుంబ సభ్యులను విచారించారు పోలీసులు. ఇదివరకు నారాయణగూడలోని ఓ అపార్టుమెంట్‌లో మృతుని కుటుంబం నివాసం ఉండేది. రామకృష్ణ కూతురు అపార్టుమెంట్ వాచ్‌మేన్ కొడుకు చెట్టి భూపాల్(20)తో ప్రేమలో పడినది. ఈ విషయం బాలిక తండ్రికి తెలిసి పలుమార్లు మందలించాడు కూడ. మరోవైపు భూపాల్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి రామకృష్ణ ఇంట్లో ఉన్నటువంటి నూ.1.75లక్షలు చోరీ కూడ చేసాడు.
Advertisement
ఈ విషయంపై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భూపాల్ ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు పోలీసులు. రామకృష్ణ తన పరువు కోసం నారాయనగూడ నుంచి కాప్రాకు మకాం మార్చాడు. జైలు నుంచి తిరిగి వచ్చాక భూపాల్ బాలికతో మాట్లాడడం మొదలెట్టాడు. భూపాల్‌నే పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ప్రేమకు అడ్డుగా ఉన్న కన్నతండ్రిని కతం చేయాలని భావించింది. ప్రియుడు భూపాల్, తన ఇద్దరు మిత్రులతో కలిసి రామకృష్ణను హత్యకు ప్లాన్ సిద్ధం చేసాడు. మత్తు గోలీలు ఇచ్చి స్పృహ తప్పేటట్టు చేసి చంపాలని నిర్ణయించారు. ఈ తరుణంలోనే జులై 19న మత్తు గోలీలకు సంబంధించిన పౌడర్‌ను అందజేసారు. తండ్రికి చికెన్ కూరలో మత్తు మందు కలిపి ఇచ్చింది.
భూపాల్ తన స్నేహితులతో కలిసి అర్థరాత్రి బాలిక ఇంటి వద్దకు చేరుకొని అందరూ కలిసి హత్య చేసారు. భూపాల్, గణేష్ బ్లాంకెట్ వేసి అదిమి పట్టుకోగా.. ప్రశాంత్ కత్తితో తలపై బలంగా పొడిచాడు. నొప్పితో రామకృష్ణ మేల్కొవడంతో అప్పటికే నిందితులు పరారు అయ్యారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామకృష్ణ మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పకుండా ప్రేమ వ్యవహారం దాచారు. తండ్రి హత్యకు పాల్పడిన కూతురు, ప్రియుడు భూపాల్, స్నేహితులు ప్రశాంత్, గణేష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు వెల్లడించారు. ప్రశాంత్ ను రక్షించాలనే ప్రయత్నం చేసిన అతని తండ్రి విజయ్‌పాల్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్టు వివరించారు పోలీసులు.