Telugu News » Blog » Hyderabad : బేకరీలో యువతి హల్చల్… పోలీసుల ఎంట్రీతో షాక్…!

Hyderabad : బేకరీలో యువతి హల్చల్… పోలీసుల ఎంట్రీతో షాక్…!

by AJAY
Ads

హైదరాబాద్ మోతీనగర్ లో ఉన్న మిడ్ ల్యాండ్ బేకరీలో ఓ మహిళా కస్టమర్ నానా హంగామా చేసింది. బెకరీకి వచ్చినవి తిని వెళ్లకుండా గొడవ మొదలు పెట్టింది. బేకరికి వచ్చిన వాళ్లపై దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్లపై అక్కడ ఉన్న ఐటమ్ లను విసరడం మొదలు పెట్టింది. కాసేపు చూసి ఊరుకున్న కస్టమర్లకు చివరికి విసుగు వచ్చింది. ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడం తో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అక్కడకు చేరుకోగా మహిళ పోలీసులపై సైతం అదే రేంజ్ లో ఫైర్ అయ్యింది.

Advertisement

Advertisement

Girl hulchal in Hyderabad bacary

Girl hulchal in Hyderabad bacary

తాను ఎలాంటి తప్పు చేయలేదని వల్లే తనతో గొడవలు దిగారు అని చెప్పింది. అంతే కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ పోలీసులను తిట్టడం షురూ చేసింది. తాను సిటిజెన్ అని కారణం లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారు అంటూ ఫైర్ అయ్యింది. అలా చాలా సేపు యువతి హంగామా కొనసాగుతూనే ఉంది. మహిళా పోలీసులు లేకపోవడం తో పోలీసులు కూడా ఆమెను అదుపులోకి తీసుకోలేకపోయారు. కానీ చివరికి ఒక మహిళా కానిస్టేబుల్ అక్కడకు చేరుకున్నారు.

 

ఆమె ఒక్కరి వల్లే యువతిని అదుపులోకి తీసుకోవడం కష్టం గా మారింది. దాంతో స్థానిక మహిళలు సైతం యువతిని అదుపులోకి తీసుకునేందుకు సహాయం చేశారు. ఈ క్రమంలో యువతి వారి పై కూడా దాడి చేసింది. కానీ చివరికి పట్టుకుని జీప్ లో ఎక్కించారు. అలా దాదాపు 20 నిమిషాల పాటు యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో యువతికి పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్ళి అఖండ సినిమా చూపించారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.