Home » నలుగురికి కొత్త జీవితానిచ్చిన ఐదేళ్ల చిన్నారి…!

నలుగురికి కొత్త జీవితానిచ్చిన ఐదేళ్ల చిన్నారి…!

by AJAY
Ad

బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన ఓ ఐదేళ్ల చిన్నారి నలుగురికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఈ ఘటన చండీగఢ్ లో చోటు చేసుకుంది. చండీగఢ్ లో ఓ ఐదేళ్ల బాలిక డిసెంబర్ 22న ఎతైన ప్రాంతం నుండి ఒక్కసారిగా పడిపోయింది. దాంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Advertisement

Advertisement

చిన్నారి బ్రతకదు అని డాక్టర్లు నిర్ధారించారు. దాంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని బాలిక తల్లిదండ్రులు అవయవదానానికి సిద్దం అయ్యారు. తమ చిన్నారి అవయావాలు ఇతరులను బతికిస్తాయని భావించారు. మొదటగా పీజిమర్ ట్రాన్స్ ప్లాంట్ కో ఆర్డినేటర్ లు చిన్నారి తండ్రిని సంప్రదించారు. కాగా ఆయన గుండె నిబ్బరం చేసుకుని సరే అన్నారు.

దాంతో వైద్యులు చిన్నారి శరీరం నుండి గుండె, కాలేయం, కిడ్నీలు, ఫ్యాంక్రియసిస్ లను తీసుకున్నారు. వాటిని ముంబై, ఢిల్లీ లో ఒక్కొక్కరికి….చండీగఢ్ లో ఇద్దరికీ కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అవయవ దానానికి ముందుకు వచ్చిన చిన్నారి కుటుంబ సభ్యులను ఆస్పత్రి వైద్యులు ప్రశంసించారు. ఇలాంటి నిర్ణయాలు ఎంతోమంది రోగుల జీవితాలను నిలబెడతాయని అన్నారు.

Visitors Are Also Reading