Home » GHOST MOVIE REVIEW: ఘోస్ట్ సినిమా రివ్యూ… మన్మథుడు యాక్షన్ థ్రిల్లర్ తో మెప్పించాడా..?

GHOST MOVIE REVIEW: ఘోస్ట్ సినిమా రివ్యూ… మన్మథుడు యాక్షన్ థ్రిల్లర్ తో మెప్పించాడా..?

by AJAY
Ad

టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే హీరోలలో నాగార్జున ఒకరు. నాగర్జున రొమాంటిక్ సినిమాలకు కింగ్ అనిపించినాముకున్నప్పటికీ అప్పుడప్పుడు డిఫరెంట్ కథలతోనూ ముందుకు వస్తుంటాడు. ఇక తాజాగా దసరా సందర్భంగా నాగార్జున గోస్ట్ అనే యాక్షన్ త్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాని తెరకెక్కించారు. గతంలో గరుడవేగ సినిమాతో ప్రవీణ్ సత్తార్ ప్రేక్షకులను అలరించారు.

Advertisement

చాలాకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న రాజశేఖర్ కు గరుడవేగ సినిమా సూపర్ హిట్ ని ఇచ్చింది. అంతేకాకుండా ప్రవీణ్ సత్తార్ గతంలో తీసిన చందమామ కథలు, గుంటూరు టాకీస్ సినిమాలు సైతం మంచి విజయం సాధించాయి. దాంతో గోస్ట్ సినిమాపై అంచనాలను నెలకొన్నాయి. ఇక దసరా సందర్భంగా విడుదలైన గోస్ట్ సినిమా ప్రేక్షకులను అలరించిందా ..? లేదా అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ &కథనం :

Advertisement

సినిమాలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్ పాత్ర లో నటించగా.. హీరోయిన్ సోనాల్ చౌహాన్ ప్రియా ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈస్ట్ ఆరేబియాలో ఇద్దరు కలిసి ఓ ఆపరేషన్ సక్సెస్ చేస్తారు. లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండే హీరో హీరోయిన్లు మరో ఆపరేషన్ చేయగా అది ఫెయిల్ అవుతుంది. ఇక అక్కడే ఓ అబ్బాయిని కిడ్నాప్ చేసి ఉగ్రవాదులు హత్య చేస్తారు. విక్రమ్ ఈ క్రమంలో డిప్రెషన్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. తాను ఎంత చెప్పినా వినకపోవడంతో ప్రియా ముంబై కి వెళ్లి ఎన్సీబీలో చేరుతుంది. ఆ తర్వాత ఐదేళ్లు గడిచిపోతాయి. ఓ రోజు అను( గుల్ పరాగ్) నుండి విక్రమ్ కు ఫోన్ వస్తుంది. తన జీవితం రిస్క్ లో ఉందని తన కూతుర్ని బెదిరిస్తున్నారని విక్రమ్ కు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తాడు. దాంతో విక్రమ్ వెంటనే ఊటీకి వెళ్లిపోతాడు. అక్కడ అను ఆమె కూతురికి పూర్తి సెక్యూరిటీని ఇస్తాడు. అసలు అనుకు విక్రమ్ తో ఉన్న సంబంధం ఏమిటి ..?ఈ ఆపరేషన్ విక్రమ్ సక్సెస్ చేశాడా…? లేదా అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :

సినిమాలో నాగార్జున విక్రమ్ అనే పాత్రకు నాగ్ పూర్తిగా న్యాయం చేశాడు. సినిమాలో ఉండే యాక్షన్ త్రిల్లింగ్ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సోనాల్ చౌహాన్ ప్రియా పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలో యాక్షన్ తో పాటు నాగార్జున అభిమానులకు బోర్ కొట్టకుండా రొమాన్స్ కూడా జోడి చేశారు. అంతేకాకుండా సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు గోస్ట్ నచ్చుతుంది. సినిమాలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా యాక్షన్ త్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఘోస్ట్ సినిమా దసరా ట్రీట్ అనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా తెరకెక్కించాడు. గరుడవేగ సినిమాతో అంచనాలను పెంచిన ప్రవీణ్ సత్తార్ తన ఖాతాలో మరో సూపర్ హిట్ ను వేసుకున్నారు. ఈసారి దసరాకు కచ్చితంగా థియేటర్లలో ఘోస్ట్ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు.

Visitors Are Also Reading