కరోనా మహమ్మారి మానవాలిని వదిలిపెట్టేలా కనిపించడంలేదు. ప్రపంచ దేశాలన్నింటిలోనూ వైరస్ ప్రభావం కనిపిస్తోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో కరోనా ఎంట్రీ ఇస్తూ ప్రజలపై పంజా విసురుతోంది. ఇప్పటికీ మహమ్మారి నివారణకు సరైన మందులు లేవన్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మాత్రం శరీరంలో యాంటీ బాడీలు పెరిగి కరోనా నుండి రక్షించుకోవచ్చు. దాంతో ప్రపంచం లోని అన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ లను శరవేగంగా వేస్తున్నాయి. ఇక భారత్ లోనూ ప్రతిఒక్కరికీ కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ లు వేసిన సంగతి తెలిసిందే.
Advertisement
అయితే కరోనా కొత్త వేరియంట్ ల రూపంలో ఎంట్రీ ఇస్తుండటంతో ఇప్పుడు బూస్టర్ డోస్ లను కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా ఇప్పటికే బూస్టర్ డోసుల ప్రక్రియను ప్రారంభించారు. కాగా అనోరోగ్యంతో బాధపడుతున్నవారు వ్యాక్సిన్ సెంటర్లకు వెళ్లలేరు కాబట్టి జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవాళ్లు జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 04021111111 కు కాల్ చేస్తే ఇంటికి వచ్చి బూస్టర్ డోసులు ఇస్తామని అధికారులు ప్రకటించారు. మొబైల్ వాహనంలో ఇంటికి వచ్చి బూస్టర్ డోసు ఇస్తామని ప్రకటించారు.
Advertisement