Home » బ్రేకింగ్ : మ‌హేష్ బాబు సోద‌రుడు ర‌మేష్‌బాబు మృతి

బ్రేకింగ్ : మ‌హేష్ బాబు సోద‌రుడు ర‌మేష్‌బాబు మృతి

by Anji
Ad

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఇంట్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. సూప‌ర్‌స్టార్ కృష్ణ పెద్ద‌కుమారుడు ర‌మేష్‌బాబు(56) కొద్ది సేప‌టి క్రిత‌మే మృతి చెందాడు. గ‌త కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ర‌మేష్ గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ర‌మేష్ కూడా హీరోగా ప‌లు సినిమాల‌లో న‌టించారు. అల్లూరి సీతారామ‌రాజు చిత్రంలో చిన్న‌ప్ప‌టి అల్లూరి సీతారామ‌రాజుగా న‌టించి అంద‌రినీ మెప్పించారు.

Advertisement

ramesh babu

Advertisement

“దొంగలకే దొంగలు, నీడ,సామ్రాట్” లాంటి చిత్రాల‌లో న‌టించిన ర‌మేష్‌.. త‌మ్ముడు మ‌హేష్ సినిమాల‌కు నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హరించారు. మ‌హేష్ న‌టించిన అతిథి, అర్జున్‌, దూకుడు, ఆగ‌డు వంటి చిత్రాల‌కు ర‌మేష్ బాబు నిర్మాత‌. ర‌మేష్ బాబు మృతితో ఘ‌ట్ట‌మ‌నేని ఇంట్లోవిషాదం చోటు చేసుకుంది. ఓవైపు మ‌హేష్‌బాబు క‌ర‌నాతో పోరాడుతున్న వేళ‌.. ఆయ‌న అన్న‌ను చూడ‌డానికి వ‌స్తారా..? రారా అనేది మాత్రం తెలియడం లేదు.

Visitors Are Also Reading