Home » Ghani movie review : వరుణ్ తేజ్ “గని” ట్విట్టర్ రివ్యూ…..సినిమా ప్లస్ మైనస్ లు ఇవే…..!

Ghani movie review : వరుణ్ తేజ్ “గని” ట్విట్టర్ రివ్యూ…..సినిమా ప్లస్ మైనస్ లు ఇవే…..!

by AJAY
Ad

Ghani Movie Review: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం గని. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల ఆలస్యం అయింది. ఇక తాజాగా ఈ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. సినిమా టీజర్ మరియు ట్రైలర్లు గని పై అంచనాలను పెంచాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి వరుణ్ తేజ్ కూడా ఆకట్టుకున్నారు.

Ghani movie Telugu review

Ghani movie Telugu review

వరుణ్ తేజ తన కెరీర్లో ఎక్కువ రోజులు ఈ సినిమా కోసమే కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం ఏకంగా మూడేళ్లు కష్టపడ్డాడు. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సినిమాలో వరుణ్ తేజ్ కి జోడిగా సాయి మంజ్రికర్ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో సునీల్ శెట్టి, ఉపేంద్ర, నదియా, జగపతిబాబు, నవీన్ చంద్ర లాంటి నటీనటులు ముఖ్యమైన పాత్రలో నటించారు.

Advertisement

ఇక ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన గని పంచ్ పడిందా…. ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం…..ఈ సినిమాలో వరుణ్ తేజ్ తన పాత్రకు న్యాయం చేసినట్టు చెబుతున్నారు. స్పోర్ట్స్ డ్రామా అంటే ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఉంటుంది. కానీ సినిమాలో ఎమోషన్స్ వర్కవుట్ కాలేదని చెబుతున్నారు.

Advertisement

ghani glimpse

ghani glimpse

ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగినట్టు చెబుతున్నారు. సినిమాకు బిజీఎం ఒకటే ప్లస్ గా నిలిచింది అని చెబుతున్నారు. అంతేకాకుండా సినిమాలో హై పాయింట్స్ ఒకటి కూడా లేవని నిరాశ చెందుతున్నారు. ఇక సినిమాలో వరుణ్ తేజ్ నటన మరియు ప్రొడక్షన్ వాల్యూ పై కూడా ప్రశంసలు అందుతున్నాయి.

 

 

Visitors Are Also Reading