Home » దేవి నాగవల్లిపై సెటైర్స్ వేసిన గెటప్ శ్రీను..!

దేవి నాగవల్లిపై సెటైర్స్ వేసిన గెటప్ శ్రీను..!

by Azhar
Ad

మాములుగా న్యూస్ రీడర్లకు అంతగా పాపులారిటీ ఉండదు అనేది అందరికి తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం తాము చేసే పనులతో భారీగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇందులో ప్రముఖ న్యూస్ ఛానెల్ యొక్క న్యూస్ రీడర్ అయిన దేవి నాగవల్లి కూడా ఉంటుంది. మామూలుగానే తన విధానాలతో పేరు తెచ్చుకున్నా దేవి నాగవల్లి… ఈ మధ్య జరిగిన ఓ సంఘటనతో మరి పాపులర్ అయ్యింది. అదే విశ్వక్ సేన్ తో గొడవ. విశ్వక్ తన కొత్త సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమేషన్స్ కోసం దేవి నాగవల్లితో ఇంటర్వ్యూకి వస్తాడు. కానీ ఈ ఇంటర్వ్యూలో విశ్వక్.. ఓ ఇంగ్లిష్ బూతు పదం వాడటం.. దానికి నాగవల్లి గెట్ ఔట్ అనడం చాలా వైరల్ గా మారింది.

Advertisement

ఈ విషయంలో చాలా మంది దేవి నాగవల్లి తప్పు ఉంది అంటే.. మరి కొందరు విశ్వక్ తప్పు ఉంది అన్నారు. ఆ తర్వాత దేవి నాగవల్లితో గొడవ పడితే సినిమా సూపర్ హిట్ అవుతుంది అని.. అందుకే ఇంత డ్రామా చేసారు అనే వార్తలు వచ్చాయి. కానీ ఈ ఘటనపై అభిమానులు ట్రోలింగ్ అనేవి ఆపలేదు. ఇక తాజాగా జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకొని సినిమాల్లో నటిస్తున్న గెటప్ శ్రీను దేవి నాగవల్లి పై సెటైర్స్ వేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

 

ప్రస్తుతం గెటప్ శ్రీను… హ్యాపీ బర్త్ డే అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో లావణ్య త్రిపాటి, నరేష్ అగస్త్య ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక వచ్చే నెల 8న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా.. తాజాగా చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో గెటప్ శ్రీను న్యూస్ రీడర్ గా కనిపిస్తుంటే.. నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, సత్య ఇందులో నిన్ను హీరో అంటే.. నిను హీరో అంటూ గొడవ పడుతుంటారు. అప్పుడు వెన్నెల కిషోర్.. విశ్వక్ వాడిన పదాని.. వాడగా.. గెటప్ శ్రీను అచ్చం నాగవల్లి మాదిరిగానే గెట్ ఔట్ అంటూ అరుస్తూ కనిపిస్తున్నాడు. ఇక ఏ ఈవీడియో చుసిన ఫ్యాన్స్ ఇది దేవి నాగవల్లిపై వేసిన పెద్ద సెటైర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ఇంగ్లాండ్ క్రికెటర్ తో సచిన్ కొడుకి ప్రేమాయణం..!

భారత భవిష్యత్ కెప్టెన్ పాండ్యనే…!

Visitors Are Also Reading