ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. చాలా రోజుల పాటు జబర్దస్త్ షో సాఫీగా సాగినప్పటికీ ఇటీవలే కొంత మంది జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు. ఇక వెళ్లిపోవడంతో అక్కడే వివాదాలు తలెత్తుతున్నాయి. తొలుత కిరాక్ ఆర్పీ ప్రారంభించిన వివాదం రోజుకొకరు కౌంటర్లతో ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. జబర్దస్త్ షో వాళ్లు ఆర్టిస్టులను బానిసలుగా చూస్తారు. తిండి కూడా సరిగ్గా పెట్టరు అంటూ ఆరోపణలు చేసి ఆర్పి వివాదాన్ని ప్రారంబించాడు. ఇక ఆర్పి చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలు అని కౌంటర్ ఇచ్చారు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్. అదేవిధంగా ఇంతకుముందు జబర్దస్త్ ప్రోగ్రాం కి ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన ఏడుకొండలు కూడా స్పందించారు. కార్తీకి కౌంటర్ ఇచ్చారు. ఏడుకొండలు ఆర్పీతో పాటు జబర్దస్త్ కాదని వేరే ఛానల్స్ కి వెళ్లిన సుడిగాడి సుదీర్, గెటప్ శ్రీనులపై కూడా ఆరోపణలు చేశాడు.
Advertisement
Advertisement
వెళ్లిపోయిన వారందరూ తిరిగి మర్యాదగా జబర్దస్త్ ప్రోగ్రామ్ కి రావాలని.. లేకపోతే అందరి గురించి బయట పెడతానంటూ హెచ్చరించాడు ఏడుకొండలు. తాను అప్పట్లో సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ తో పాటు మిగిలిన కమెడియన్లకు కూడా ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు చొప్పున ఇప్పించినట్టు గుర్తు చేశారు. శ్రీను కారు కొనుక్కోవాలి రెమ్యూనరేషన్ పెంచమని అడిగితే నా కారు ఇచ్చేశానని చెప్పాడు. ఈ విషయంపై గెటప్ శ్రీను స్పందించారు. ముఖ్యంగా నేను అమ్మాను అని చెప్పడానికి, ఇచ్చాను అని చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉందయ్యా..! కెమెరా ఉంటే చాలు స్పృహ లేకపోతే ఎలా అయ్యా. అనే మాటలతో కొండలు ఉన్నట్టుగా ఓ ఎమోజి ని కూడా షేర్ చేశాడు గెటప్ శీను.
ఇక ఇది ఏడుకొండలు కి కౌంటర్ అని అందరికీ అర్థమైపోయింది. కారు అమ్మితే తాను కొనుక్కున్నానని.. కారు ఇచ్చేశాను అని చెప్పడానికి, అమ్మాను అని చెప్పడానికి చాలా తేడా ఉందని గెటప్ శీను చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా డైరెక్ట్ గా కూడా ఏడుకొండలు కు కౌంటర్ ఇచ్చాడు. గెటప్ శీను ఏకంగా ఏడుకొండలు ఫోటోలు పెట్టి నేను స్కిట్ లో చేసిన బిల్డప్ బాబాయ్ క్యారెక్టర్ కి ఇతనే స్ఫూర్తి అంటూ కౌంటర్ ఇచ్చాడు. కొంత మందికి డబ్బులు ఇచ్చాను, శ్రీనుకు కారు ఇచ్చాను అని చెప్పడంతో ఏడుకొండలు ను బిల్డప్ బాబాయ్ తో పోల్చి గెటప్ శ్రీను స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
Also Read :
ఉదయ్ కిరణ్ ని చిరు ఫామిలీ లో కలుపుకుందాం అనుకున్నారు కానీ చివరికి..!
పచ్చిమిర్చితో కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?