శ్రీకాకుళం జిల్లా నుంచి వలస కూలీలుగా కలింగ గూడెం వచ్చిన బొడ్డుపల్లి శ్రీరామస్వామి దాలమ్మ దంపతుల కుమారుడు గెటప్ శ్రీను. గ్రామంలోని పంట కాలువ పక్కన చిన్న పూరింట్లో అతడి బాల్యం గడిచింది. సిద్దాపురం హైస్కూల్లో 10వ తరగతి వరకు, ఆ తర్వాత ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అలా తల్లిదండ్రులతో కూలి పనులకు వెళ్లే గెటప్ శ్రీను, చిన్నతనం నుంచే చాలా కామెడీగా ఉండేవాడు. తోటి కూలీలు పనిచేస్తున్న విధానాన్ని బట్టి హాస్యాన్ని పండించేవాడు. ఇక అప్పటినుంచి హాస్య హావభావాలను నేర్చుకున్న గెటప్ శీను పాఠశాల కళాశాలలో తన స్నేహితులతో సరదాగా కామెడీ చేస్తూ ఉండేవాడు.
Advertisement
Advertisement
ఆ సమయంలోనే గెటప్ శీనుకు చిరంజీవి అంటే చాలా అభిమానం. చిరంజీవి లాగే సినిమాల్లో రాణించాలని అనుకున్నాడు. ఇక ఇంటర్ తో చదువుకు స్వస్తిపలికి జబర్దస్త్ లోకి ఎంటర్ అయి చాలా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అనేక టీవీ షోలలో స్టేజ్ షోలు చేశాడు. ఈ విధంగా వివిధ గెటప్లతో అందరినీ ఆకట్టుకొని గెటప్ శ్రీనుగా పేరు సంపాదించుకున్నాడు. ఇక సినీ యాక్ట్రెస్ అయినట్టు వేణు సహకారంతో తెలుగు అబ్బాయి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమై, ఇస్మార్ట్ శంకర్, లైగర్ రంగస్థలం, జాంబీ రెడ్డి,గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు.
ప్రస్తుతం ఆయన చేస్తున్న బోళా శంకర్ తదితర చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ విధంగా తన నటనా టాలెంట్ తో కళా రంగంలో రాణిస్తూ ఆర్థికంగా స్థిరపడి హైదరాబాదులో సెట్ అయిపోయాడు. ఏది ఏమైనా గెటప్ శీను ఒకే ఒక మాట అంటాడు. అందరూ నవ్విస్తారు కానీ ఒక మనిషిని మెస్మరైజ్ చేసేలా నటించడమే గొప్పతనం అంటూ కొన్ని ఇంటర్వ్యూలలో గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సినిమాల్లో రాణించడమే తన లక్ష్యమని తెలియజేశాడు.
also read: