Telugu News » Blog » మీ మీద ఉన్న గౌరవాన్ని కోల్పోకండి…..మంత్రి రోజా పై గెటప్ శ్రీను సంచలన వ్యాఖ్యలు…!

మీ మీద ఉన్న గౌరవాన్ని కోల్పోకండి…..మంత్రి రోజా పై గెటప్ శ్రీను సంచలన వ్యాఖ్యలు…!

by AJAY
Ads

సినిమాలు రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ఒకప్పుడు సినిమాల్లో రాణించి ఆ తరవాత రాజకీయాల్లో చక్రం తిప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతే కాకుండాప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న వాళ్ళు సైతం ఉన్నారు. అయితే సినిమాల్లో కలిసి ఉన్నప్పటికీ రాజకీయాల విషయానికీ వచ్చేసరికి ఒకరి ఒకరు విమర్శలు చేసుకోవడం తప్పదు.

Advertisement

ఇక ఒకప్పుడు జబర్దస్త్ తో కలిసి జడ్జిలు గా వ్యవహరించిన నాగబాబు , రోజా కూడా ప్రస్తుతం విమర్శలు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి రోజా మెగా బ్రదర్స్ పై విమర్శలు కురిపించారు. అంతే కాకుండా చిరంజీవి పై సైతం రోజా విమర్శలు కురిపించారు. మెగా బ్రదర్ నాగబాబు సైతం రోజా పై ఫైర్ అయ్యారు. అయితే తాజాగా ఈ వివాదంలోకి గెటప్ శ్రీను సైతం ఎంట్రీ ఇచ్చ్చాడు.

Advertisement

గెటప్ శ్రీను జబర్థస్త్ లో కమెడియన్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు రోజా తో గెటప్ శ్రీను ఎంతో చక్కగా కలిసి మెలిసి సరదాగా ఉండేవాడు. కానీ మెగా బ్రదర్స్ పై రోజా చేసిన కామెంట్ లపై గెటప్ శ్రీను స్పందించాడు. సోషల్ మీడియా వేధికగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన పోస్ట్ లో గెటప్ శ్రీను…..చిరంజీవి గారి సేవ గుణం.. ధాన గుణం తెరిచిన పుస్తకం. ఒక స్పూర్తి ఆ విషయం మీకెందుకు కనపడలేదో రోజా గారు. ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకోండి.

Advertisement

మీ ఉనికి కోసం ఆయన పైన విమర్శలు చేసి ప్రజల్లో మీకు ఉన్న గౌరవాన్ని కోల్పోకండి…. ఓ చిరంజీవి అభిమాని….అంటూ గెటప్ శ్రీను తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దాంతో గెటప్ శ్రీను నేరుగా రోజా పై అంతటి కామెంట్స్ చేశాడా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.