Home » Kamala:మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర అబద్ధం.. మా నాన్న అలా చేయలేదు..!

Kamala:మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర అబద్ధం.. మా నాన్న అలా చేయలేదు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

మహానటి మూవీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది అలనాటి మేటి నటి సావిత్రి.. ఇండస్ట్రీలో ఎలాంటి ఫెసిలిటీస్ లేని సమయంలోనే తన నటన అభినయంతో ఎంతోమందిని మంత్రముగ్ధుల్ని చేసింది సావిత్రి. అలాంటి సావిత్రి ఇండస్ట్రీలో ఎన్ని భోగభాగ్యాలు అనుభవించిందో చివరి రోజుల్లో మాత్రం చాలా దారుణంగా మరణించిందని మహానటి సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చింది.

Advertisement

ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకొని 30 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కీర్తి సురేష్ ఎన్ని సినిమాల్లో నటించిన కానీ మహానటి మూవీ తర్వాతే ఆమెకు చాలా పేరు వచ్చింది అని చెప్పవచ్చు. అయితే తాజాగా మహానటి మూవీ పై జెమినీ గణేషన్ కూతురు కమల సెల్వరాజ్ ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను చెప్పింది. ఇంతకీ ఆమె ఏమన్నదయ్యా అంటే .. నేను జెమినీ గణేషన్ కూతురుగా పుట్టడం అదృష్టమని తెలిపింది. నాన్నగారు 4 షిఫ్ట్ లో పనిచేసేవారు. ఎంతో కష్టపడే గుణం ఆయనది. చాలా మంచి వ్యక్తి కూడా. మేము ఆయనతో పాటు షూటింగు లొకేషన్స్ కి వెళ్లే వాళ్ళం. ఆ టైంలో అక్కడివాళ్లు చూసి మీ చెల్లెళ్లా అని అడిగేవారు.

Advertisement

కానీ మహానటి చిత్రంలో నాన్న పాత్ర గురించి చూపించిందంతా నిజం కాదు. అంతా అబద్ధమే అంటూ ఆమె తెలియజేసింది. ఇండస్ట్రీలో చాలామంది బయటకు చెప్పకుండా సీక్రెట్ గా ఎన్నో పెళ్లిళ్లు చేసుకొని మెయింటైన్ చేస్తారు. కానీ నాన్న అలా కాదు ఏదైనా ఓపెన్ గానే ఉంటారని కమల వెల్లడించింది. పెళ్లి విషయంలో నాన్న ఎవరిని ఫోర్స్ చేయలేదని, చాలామంది హీరోయిన్లు నాన్న కోసం ఎదురు చూసేవారని అన్నది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో చాలామంది నెటిజెన్లు అసలు జెమినీ గణేషన్ పాత్ర ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నారు.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading