Telugu News » Blog » ఏం మాయ చేసావే 2.. సామ్ ఏం అంటుంది..?

ఏం మాయ చేసావే 2.. సామ్ ఏం అంటుంది..?

by Manohar Reddy Mano
Ads
టాలీవుడ్ హీరోలలో ఒక్కడిగా ఉన్న నాగ చైతన్యకు హిట్ ఇచ్చిన మొదటి సినిమా ఏం మాయ చేసావే అబే సినిమా. ఇందులో నాగ చైతన్యకు జంటగా సమంత నటించింది. ఆమెకు కూడా ఇదే మొదటి సినిమా. అయితే వీరి ప్రేమాయణం కూడా ఈ సినిమాతోనే మొదలయ్యింది అనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి రొమాంటిక్ లవ్ స్టోరీగా నిలిచింది.
అయితే ఈ సినిమా ద్వారా ప్రేమ ప్రయాణం మొదలు పెట్టిన నాగ చైతన్య, సమంత తర్వాత పెళ్లి చేసుకొని విడిపోయారు కూడా. అయితే ఈ విషయం అనేది ఇప్పుడు గౌతమ్ మీనన్ చేసిన కొన్ని కామెంట్స్ ద్వారా చర్చల్లోకి వచ్చింది. అయితే ఆయన ఓ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. నాకు నాగ చైతన్యతో ఏం మాయ చేసావే 2 సినిమా అనేది తీయాలని ఉంది అన్నాడు.
ఇక ఈ సినిమా తీయాలి అంటే మళ్ళీ నాగ చైతన్య, సమంత ఉండాల్సిందే అనే విషయం తెలిసిందే. ఇక విడాకుల తర్వాత మళ్ళీ సమంతతో నటించడం పట్ల తనకు ఏం అభ్యంతరం లేదు అని చైతన్య చెప్పాడు. కానీ సమంత మాత్రం ఎప్పుడు అలంటి కామెంట్స్ చేయలేదు. కాబట్టి గౌతమ్ మీనన్ ఆ సినిమా సీక్వెల్ తో ముందుకు వస్తే సమంత ఒప్పుకుంటుందా.. లేదా అనే చర్చ జరుగుతుంది.