సాధారణంగా పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి. ఒక్కో ఏడాది ఒక్కో నది పుష్కరాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది గంగానది పుష్కరాలు జరుగుతున్నాయి. గంగానది ఉత్తర భారతదేశంలో ప్రవహిస్తుంది. కానీ గంగా పుష్కరాల కోసం ఇతర రాష్ట్రాలకు, సూదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. తెలంగాణలో పుస్కర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రవహించే మంజీరా నదికి గరుడ గంగ పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం..!
Advertisement
ముఖ్యంగా గంగానది పుష్కరాల కోసం ఉత్తరాది రాష్ట్రాల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. తెలంగాణలో గరుడ గంగ పుష్కరాల పేరిట ఉత్సవాలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో పుట్టి.. కర్నాటక మీదుగా గౌడ్ గావ్ దగ్గర తెలంగాణలోకి ప్రవహించే మంజీరా నదికి మరోసారి కుంభమేళా నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కర్ మండలం రాఘవపూర్ శివార్ల ప్రాంతంలోని పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో ఈ గరుడ గంగ కుంభమేళా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 24 నుంచి మే 5వ తేదీ వరకు 12 రోజుల పాటు కుంభమేళా ఉత్సవం నిర్వహిస్తున్నారు.
Advertisement
మంజీరా నది ఒడ్డున జరిగే ఈ మహా కుంభమేళాను నాగసాధవులు, సాధుసంతులతో పాటు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. 2010, 2013, 2018లో కుంభమేళా ఘనంగా జరిగింది. ఈ సారి కూడా ఇక్కడ కుంభమేళా అదే స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. భక్తులకు అన్నదానం అందించేందుకు ప్రత్యేక షెడ్లు, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ఏర్పాట్లు చేస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రత్యేక ఘాట్ లను నిర్మించారు. విద్యుత్ సరఫరా ఉండేవిధంగా విద్యుత్ శాఖ చర్యలు తీసుకుంటోంది.
Also Read : మీకు కాబోయే భార్యతో పొరపాటున కూడా ఈ విషయాలను చర్చించకండి.. జాగ్రత్త !
మరోవైపు లోక కల్యాణం కోసం గరుణ గంగ పూర్ణ మంజీర కుంభమేళా నిర్వహిస్తున్నామని, గంగానధికి కర్కాటక రాశిలో గురుడు ఉండగా చేసే స్నానం, సింహరాశిలో గురుడు ఉండగా వేయిసార్లు స్నానం చేస్తే ఏ ఫలమో, కన్నరాశి గురుడు ఉండగా కృష్ణనదిలో వందసార్లు స్నానం చేస్తే ఏ ఫలితం ఉంటుందో.. మేషరాశిలో సూర్యుడు ఉండగా మంజీర నదిలో ఒక్కసారి స్నానం చేసినా అంత ఫలితం ఉంటుంది. ఈ కుంభమేళాలో భాగంగా ఏప్రిల్ 24, 25, 27, 30, మే 04, 05 తేదీలలో మంజీర నదిలో పుణ్యస్నానాలు చేస్తే అంత పుణ్యం లభిస్తుందని కాశీనాథ్ బాబా, సిద్ధ సరస్వతీదేవి పంచవటి క్షేత్ర పీఠాధిపతి తెలిపారు.
Also Read : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పవన్ హీరోయిన్…ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?