Home » “గంగుబాయి కతివాడి” ట్రైలర్ వచ్చేసింది….!

“గంగుబాయి కతివాడి” ట్రైలర్ వచ్చేసింది….!

by AJAY
Ad

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం గంగుబాయి కతివాడి. ఈ సినిమాను కామాటిపుర నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జయంతి లాల్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది.

Advertisement

Advertisement

కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా వేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 25వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. కాగా గంగుబాయి గా ఆలియాభట్ నటనతో అదరగొట్టింది…వారి జీవితాలను మార్చడం భవిష్యత్ ను మార్చడానికి గంగుబాయి చేసే పోరాటం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. మరి సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

 

Visitors Are Also Reading