అల్లు అర్జున హీరోగా తెగులు ఇండస్ట్రీకీ పరిచయమైనా సినిమా గంగోత్రి. ఈ సినిమాలో పిల్లలకు బాగా నచ్చే వల్లంకి పిట్ట పాట.. అలాగే అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అందరికి బాగా గుర్తుంటుంది. తనే బేబీ కావ్య. కానీ ఇప్పుడు బ్యూటీ కావ్యగా మారింది. బాల నటిగా చాలా సినిమాల్లో నటించిన కావ్య.. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. వరుసగా తెలుగు, తమిళ్ లో ఆడిషన్స్ ఇస్తూ వస్తుంది.
ఇక తాజాగా కావ్య మాట్లాడుతూ… లాక్ డౌన్ కంటే ముందే నేను నా ప్రయత్నాలు ప్రారంభించాను. ఈ కరోనా అనేది రాకపోతే ఇప్పటికే నా సినిమా స్టార్ట్ అయ్యేది అని కావ్య తెలిపింది. అలాగే 12 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అంటించిన నేను మొదటి నుండే హీరోయిన్ కావాలి అనుకున్నాను. కానీ సినిమాతో పాటుగా చదువు కూడా ఇష్టమే. అందుకే హీరోయిన్ అయితే చదవలెను అని.. ఇప్పుడే చదవాలని అనుకున్నాను. ఆ కారణంతోనే లా పూర్తి చేశాను అని కావ్య పేర్కొంది.
ఇక నేను చిన్నపాటి నుండి పూణేలో ఉన్నా.. తెలు సినిమాలు బాగా చూసేదానిని. తెలుగమ్మాయిని కావడం నాకు ప్లస్. ఎందుకంటే.. నాకు తెలుగు వచ్చు కాబట్టి.. కథను అందులోని డెప్త్ ను బాగా అర్ధం చేసుకోగలను. అయితే నాకు రియాలిటీకి దగ్గరగా ఉండే రోల్స్ చాలా ఇష్టం. అయితే ఇప్పుడు కరోనా రావడం వల్ల.. జనాలు ఓటీటీ, సీరియల్స్ కు బాగా అలవాటు పడ్డారు. అలాగే కంటెంట్ కూడా ఐపొవస్తుంది. కాబట్టి ఇప్పుడు నా ఎంట్రీకీ కొంచెం సమయం పడుతుంది కావ్య ప్రకటించింది.
ఇవి కూడా చదవండి :
ధోని తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు..?
సన్ రైజర్స్ కు వార్నర్ బుద్ధి చెప్పాడు…!