Home » Gangavva : చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణలు… తప్పుగా అనుకోవద్దు సార్…

Gangavva : చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణలు… తప్పుగా అనుకోవద్దు సార్…

by Bunty
Published: Last Updated on
Ad

తెలుగులో ఎక్కువగా పాపులర్ అయిన యూట్యూబ్ ఛానల్స్ లో మై విలేజ్ షో కూడా ఒకటి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది నటీనటులు పరిచయమయ్యారు. ఇక ఈ ఛానల్ లో నటించే వారిలో గంగవ్వ అనే మహిళ ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్నారు. పల్లెటూరు యాసలో గంగవ్వ చెప్పే డైలాగులు ప్రేక్షకులకు తెగ నచ్చాయి. దాంతో గంగవ్వ సినిమా ఆఫర్లను అందుకున్నారు.

Advertisement

అంతేకాకుండా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా టాలీవుడ్ టాప్ హీరోలను హీరోయిన్లను గంగవ్వ ఇంటర్వ్యూలు చేశారు. అయితే తాజాగా గంగవ్వ ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ తరుణంలో చంద్రబాబుకు క్షమాపణలు చెప్పింది. గంగవ్వ ఒక తెలుగు ఛానల్ లో ఉగాదిని పురస్కరించుకొని ఈ ఏడాది ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయగా, అందులో పార్టిసిపేట్ చేసినా గంగవ్వకు సినీ రాజకీయ నాయకుల జాతకాలు చెప్పాలంటూ స్క్రీన్ పై చంద్రబాబు, లోకేష్ ఫోటోలు చూపించి యాంకర్ అడిగిన ప్రశ్నకు గంగవ్వ చంద్రబాబుకు గ్రహణం పట్టుకుంది అంటూ వాక్యానించారు.

Advertisement

దీన్ని ఇతర పార్టీల వారు ట్రోల్ చేసి నెట్టింట్లో వైరల్ చేశారు. దీనిని గమనించిన మై విలేజ్ షో టీం గంగవ్వ ఒక వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు. చంద్రబాబుపై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని…సినీ, రాజకీయ నాయకుల గురించి అంతగా తనకు అవగాహన లేదని ఆ ఛానల్ వాళ్ళు చెప్పింది నేను చేశానని, అంతకుమించి నాకు ఏం తెలియదని చంద్రబాబుకు క్షమాపణలు చెబుతూ ఆ వీడియోలో గంగవ్వ కన్నీరు పెట్టుకున్నారు. ఇక వీరు ఇచ్చిన క్లారిటీపై టిడిపి పార్టీ ఇంకా స్పందించలేదు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ వేధించాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

సంతానం లేదు… మరీ శరత్‌ బాబు కోట్ల ఆస్తులకు వారసులు ఎవరు..!

Visitors Are Also Reading