Gam Gam Ganesha Review: గం గం గణేశా సినిమాకు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించారు. వంశీ కృష్ణ కారుమంచి, కేదర్ సెలగంశెట్టి నిర్మించగా… చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు. ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమా కథ రివ్యూ రేటింగ్ చూద్దాం.
సినిమా: గం గం గణేశా
దర్శకత్వం: ఉదయ్ బొమ్మిశెట్టి
నిర్మాత: వంశీ కృష్ణ కారుమంచి, కేదర్ సెలగంశెట్టి
నటీ నటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
సంగీతం: చైతన్ భరద్వాజ్
Advertisement
కథ మరియు వివరణ:
ఇక కథ విషయానికి వస్తే గణేష్ (ఆనంద్ దేవరకొండ) ఒక అనాధ. తన ఫ్రెండ్ (జబర్దస్త్ ఇమ్మానుయేల్) తో కలిసి చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. శృతి తో ప్రేమలో పడతాడు శృతి మాత్రం తనకు బెటర్ ఆప్షన్ దొరకగానే గణేష్ కి హ్యాండ్ ఇస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిమాణాలను నేపథ్యంలో గణేష్ ఒక వజ్రాన్ని దొంగతనం చేస్తాడు ఆ వజ్రం కోసం అతను ఏం చేశాడు. ముంబై నుండి వజ్రాన్ని తెస్తున్నప్పుడు గణేష్ విగ్రహం లోకి ఎలా వెళ్ళింది..? గణేష్ విగ్రహం లోకి 100 కోట్లు ఎలా వచ్చాయి అసలు ఈ 100 కోట్లు ఎవరివి..? గణేష్ లైఫ్ లోకి నేలవేణి ఎలా వచ్చింది..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి. ప్రధాన పాత్ర అయిన గణేష్ పాత్ర చాలా బాగుంది పాత్రకి తగ్గ న్యాయం చేశారు గం గం గణేశా మూవీ కొన్నిచోట్ల బాగా ఆకట్టుకుంది.
Advertisement
ముఖ్యంగా కామెడీ టోన్ తో సహా కొన్ని సస్పెన్స్ సీన్స్ అలానే ట్విస్టులు బాగున్నాయి. ఎమోషన్స్ వంటివి కూడా సినిమాకు ఆకర్షణంగా నిలిచాయి. ఆనంద్ దేవరకొండ తన పాత్రకు తగ్గట్టుగా బాగా నటించి నేర్పించాడు. లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటెన్ చేశాడు రియల్ ఎస్టేటింగ్ తో మెప్పించాడు. హీరోయిన్ పాత్రలో నటించిన ప్రగతి శ్రీనివాస్ కూడా బానే నటించింది ఆమె హావభావాలు బాగా అలరించాయి. ఇంకో హీరోయిన్ అయినా నయన్ సారిక నటన కూడా ఆకట్టుకుంది.
వెన్నెల కిషోర్ తదితరులు కూడా బానే నటించారు అయితే పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యులర్ గా ఉండడం సినిమాకు మైనస్ అయింది. కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. పైగా కొన్ని సన్నివేశాలు స్లోగా వెళ్తాయి. ఇవన్నీ కూడా సినిమాకి మైనస్ అయ్యాయి. లొకేషన్ అలానే నాచురల్ విజువల్స్ తో సినిమాటోగ్రఫీ బాగుంది ఆదిత్య జవ్వాది వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగుంది ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ అవ్వదు.
Also read:
ప్లస్ పాయింట్స్:
నటీ నటులు
కామెడీ
ఎమోషన్స్
మైనస్ పాయింట్లు:
స్లోగా నడిచే కథ
రొటీన్ స్టోరీ
రేటింగ్: 2.5/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!