Home » మీ G-mail అకౌంట్ లాక్ అయిందా..? అయితే ఇలా ప్ర‌య‌త్నించండి

మీ G-mail అకౌంట్ లాక్ అయిందా..? అయితే ఇలా ప్ర‌య‌త్నించండి

by Anji
Ad

ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 2 బిలియ‌న్‌ల వినియోగ‌దాల‌ను క‌లిగి ఉన్న జీ-మెయిల్ సేవ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఆండ్రాయిడ్ మొబైల్ వాడాలంటే జీ-మెయిల్ ఖాతా త‌ప్ప‌నిస‌రి గూగుల్ ఇత‌ర సేవ‌లు, డేటా, ఫైల్స్‌, యాక్సెస్‌, షేరింగ్ కూ జీ-మెయిల్ కీల‌కం. మ‌రి ఇంత ప్రాధాన్యం క‌లిగి ఉన్న జీ-మెయిల్ లాక్ కావ‌డం, యాక్సెస్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ కోల్పోవ‌డం జ‌రిగితే ఎలా అని ఆలోచిస్తున్నారా..? అయితే ఖాతాను పున‌రిద్ధ‌రించ‌డానికి ఇలా చేయండి.

G mail

G mail

ఒక వేళ మీకు జీ-మెయిల్ ఐడీ గుర్తు లేన‌ట్ట‌యితే ఫోన్ నెంబ‌ర్‌తో సైన్ ఇన్ అవ్వండి. అదేవిధంగా Forgot password పై క్లిక్ చేసి ఫోన్ నెంబ‌ర్‌తో పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకోవ‌డం సులువైన మార్గం.

Advertisement

Also Read : టాటా.. అమ్మ‌కాల్లో స‌రికొత్త మైలు రాయి ఘ‌న‌త

Advertisement

G-mail

G-mail

  • ఈ ప‌ద్ద‌తి విఫ‌ల‌మైతే ఐఫోన్‌, ఐప్యాడ్‌లో నేరుగా గూగుల్ ఖాతాలో లాగిన్ కావ‌డం ద్వారా జీ-మెయిల్‌ను పున‌రుద్ధ‌రించ‌వ‌చ్చు. ఇక్క‌డ ఎటువంటి ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ను న‌మోదు చేయాల్సిన ప‌నిలేదు. కానీ మొబైల్ నెంబ‌ర్ వంటి వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ధృవీక‌రించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ డివైస్‌ల‌లో Google Authenticator యాప్‌ను ఉప‌యోగించి ఖాతాను తిరిగి యాక్సెస్ చేసుకోవ‌చ్చు.

 

  • జీ-మెయిల్ లాక్ అయిన సంద‌ర్భాల్లో సైన్ ఇన్ చేయ‌డానికి త‌ర‌చూ వినియోగించే కంప్యూట‌ర్, ల్యాప్ లాప్‌ల‌ను వాడండి. అందులో మీరు సాధార‌ణంగా వినియోగించే క్రోమ్‌, స‌ఫారీ బ్రౌజ‌ర్‌ను ఉప‌యోగించండి. జీ-మెయిల్ లాక్ కావ‌డం కన్నా ముందే ముఖ్యంగా మేనేజ్ గూగుల్ ఖాతాలోకి వెళ్లి సెక్యూరిటీలో రిక‌వ‌రీ ఈ-మెయిల్ ఫోన్ నెంబ‌ర్ సెట్ చేసుకోవ‌డం మేలు. త‌ద్వారా పాస్ వ‌ర్డ్ లాగిన్‌కు సంబంధించిన ఓటీపీ వివ‌రాల‌ను గూగుల్ రీక‌వ‌రీ ఈమెయిల్ నెంబ‌ర్‌కు పంపే అవ‌కాశ‌ముంటుంది.

 

  • ఖాతా రిక‌వ‌రీ కాకుంటే గూగుల్ మిమ్మ‌ల్ని ప‌లు సెక్యూరిటీ ప్ర‌శ్న‌లు కూడా అడుగ‌వ‌చ్చు. ఈ ప్ర‌శ్న‌ల‌ను దాట‌వేయ‌కుండా వాటికి స‌మాధానం ఇస్తే మీ మెయిల్ ఓపెన్ అవుతుంది

Visitors Are Also Reading