Telugu News » Blog » దసరా సినిమా రన్ టైమ్, సెన్సార్ తో సహా పూర్తి వివరాలు ఇవే..!

దసరా సినిమా రన్ టైమ్, సెన్సార్ తో సహా పూర్తి వివరాలు ఇవే..!

by Anji
Ads

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా దసరా మూవీ మేనియా కొనసాగుతుంది. దసరా మూవీ ట్రైలర్ సృష్టించిన బీభత్సమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ ఒదెల రియాలిస్టిక్ విధానంతో సినిమా తీసారు. ట్రైలర్ అద్భుతంగా కట్ చేశారు. ఈ చిత్రం పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. నాని బీస్ట్ మోడ్ కూడా మామూలుగా లేదు. మార్చి 30న దసరా చిత్రం విడుదల కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ దేశ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Advertisement

Also Read :  చిరంజీవి, సుధాకర్ దొంగతనం చేసి దొరికిపోయారా..?

Advertisement

ఇదిలా ఉండగా..  దసరా చిత్రానికి సంబంధించిన మేకర్స్ ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసారు. ఈ చిత్రంలో యాక్షన్ సీన్లు బాగా ఉన్నప్పటికీ దసరాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్ని బీప్ లు చిన్న కట్ లు మినహా సెన్సార్ బోర్డు దసరా చిత్రానికి కుటుంబాలు, పిల్లలతో సహా అన్ని రకాల ప్రేక్షకులు ఈ సినిమాను చూడవచ్చని తెలిపింది. ఈ చిత్రం రన్ టైమ్ 2 గంల 36 నిమిషాలు. కమర్షియల్ సినిమాకి ఇది సరైన రన్ టైమ్. సెన్సార్ బోర్డు సభ్యులు కూడా ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. దసరా చిత్రం ట్రైలర్ చూస్తుంటే ప్రతీకార కథలా కనిపిస్తోంది. ఈ సినిమాను శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీగా బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నారు.  

Also Read :  కనీస అర్హత లేని చిత్రాలు ఆస్కార్ కు పోతున్నాయి.. AR రెహమాన్ కామెంట్స్ వైరల్ ..!!

Manam News

మంచి, చెడుపై సాధించిన విజయాన్ని సూచిస్తుంది. దసరా సినిమాలో చాలా సహజమైన, అసలైన ప్రేమకథ, గొప్ప స్నేహం, వర్గ విభేదాలు, ప్రేక్షకులను అలరించే అనేక అంశాలున్నాయి. వేసవి దసరాతో బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ కి గొప్ప ప్రారంభం కానుంది. దక్షిణాది భాషలతో పాటు హీందీలో కూడా ఈ చిత్రం విడుదల కాబోతుంది. నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. సంతోష్ నారాయణ మ్యూజిక్ అందించారు. ఇటీవలే విడుదలైన చమ్కీల అంగిలేసి పాట సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.  ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మార్చి 30 వరకు ఎదురుచూడాల్సిందే. 

Advertisement

Also Read :  రెండో పెళ్లి చేసుకున్న స‌మంత‌..? ఆ తాళి వెన‌క దాగున్న నిజం ఏంటంటే..?