Home » కొలెస్ట్రాల్ త‌గ్గాలంటే ప్ర‌తిరోజు ఏయే పండ్లు తినాలో తెలుసా..?

కొలెస్ట్రాల్ త‌గ్గాలంటే ప్ర‌తిరోజు ఏయే పండ్లు తినాలో తెలుసా..?

by Anji
Ad

ప్ర‌స్తుతం ఉన్న కంప్యూట‌ర్ కాలంలో చాలా మంది అధికంగా కొలెస్ట్రాల్ పెంచి బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు చాలా కార‌ణాలున్నాయి. జంక్‌ఫుడ్ తిన‌డం, స‌మ‌యానికి తిన‌క‌పోవ‌డం ఇలా ఊబ‌కాయం, ఎసిడిటి వంటి స‌మ‌స్య‌ల‌తో పాటు పొట్ట‌రావ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కుంటున్నారు. అయితే ముఖ్యంగా పెరిగిన కొలెస్ట్రాల్‌ను త‌గ్గించాలంటే ప్ర‌తిరోజు వ్యాయామంతో పాటు ఈ 5 పండ్ల‌ను తీసుకోవాలి. వీటితో మంచి ఫ‌లితాలుంటాయి. ఈ పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీలు

Advertisement

strawberry | Description, Cultivation, Species, & Facts | Britannica

స్ట్రాబెర్రీలు అత్యంత రుచిక‌ర‌మైన పండ్లు. వీటిని సౌంద‌ర్య సాధ‌నాల్లో వాడుతారు. తియ్య‌గా ఉన్న స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉండ‌డంతో చ‌ర్మానికి గ్లో తీసుకొస్తుంది.

యాపిల్స్

13 Appls Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

యాపిల్స్ పోష‌కాలు అధికంగా ఉంటాయి. ప్ర‌తిరోజూ ఒక యాపిల్ తింటే డాక్ట‌ర్ వ‌ద్దకు కూడా వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. పెక్టిన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఫైబ‌ర్ కూడా త‌గిన మోతాదులో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

Advertisement

సిట్ర‌స్ పండ్లు

 

Breastfeeding Moms Should Eat Citrus Fruits Or Not?! Benefits Of For Health  Tips Good Latest News Women-TeluguStop

నారింజ‌, నిమ్మ‌, ద్రాక్ష మొద‌లైన‌వి సిట్ర‌స్ జాతికి చెందిన పండ్లు. ఇందులో సీ విట‌మిన్ అధికంగా ఉంటుంది. ఇవి ఎక్కువ‌గా చ‌లికాలంలో ల‌భిస్తాయి. ఈ పండ్లు కొలెస్ట్రాల్ త‌గ్గించ‌డంలో ప్ర‌భావవంతంగా ప‌ని చేస్తాయి. విట‌మిన్ సీ పుష్క‌లంగా ఉండ‌డంతో రోగ‌నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతాయి.

ద్రాక్ష

1,000+ Best Grapes Photos · 100% Free Download · Pexels Stock Photos

శీతాకాల‌పు చిరు తిండి కోసం చూస్తున్నారా..? అందుకు ద్రాక్ష బెస్ట్. ఈ చిన్న ఆకుప‌చ్చ మెత్త‌ని పండ్లు రుచిక‌ర‌మైన, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారంగా చెప్ప‌వ‌చ్చు. ఇవి బ‌రువు త‌గ్గించ‌డానికీ స‌హాయం చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో ద్రాక్ష ఎలా స‌హాయ‌ప‌డుతుందో ప‌లు అధ్య‌య‌నాలు నిరూపించాయి.

అవోకాడో

12 health benefits of avocado

కొలెస్ట్రాల్‌తో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తులు త‌రుచుగా అవొకాడో తిన‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయ‌నే అపోహ‌తో దూరంగా ఉంటారు. కానీ యూఎస్‌డీఏ ప్ర‌కారం.. అవోకాడోలో 0 మిల్లిగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఎలాంటి అనుమానం లేకుండా తిన‌వ‌చ్చు. అద‌నంగా ఇది ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వుల‌ను ఉత్ప‌త్తి చేస్తుంటుంది.

Visitors Are Also Reading