Home » ఆంధ్రావాలా నుంచి అజ్ఞాతవాసి వరకు సంక్రాంతికి డిజాస్టర్ గా నిలిచిన 15 సినిమాలు ఇవే..!

ఆంధ్రావాలా నుంచి అజ్ఞాతవాసి వరకు సంక్రాంతికి డిజాస్టర్ గా నిలిచిన 15 సినిమాలు ఇవే..!

by Anji
Ad

సాధారణంగా సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు సినిమాలు కాస్త ఎక్కువగానే విడుదలవుతుంటాయి. సినిమా ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం సంక్రాంతి సీజన్ లో బాగా వస్తాయని నిర్మాతలు నమ్ముతుంటారు. అలాగని సంక్రాంతికి వచ్చిన ప్రతీ సినిమా హిట్ అవ్వదు. కొన్ని హిట్ అయితే.. మరికొన్ని ఫట్ కూడా అవుతాయి. సంక్రాంతి సీజన్ లో విడుదలైన చాలా సినిమాలు డిజాస్టర్ గా మిగిలినవి ఉన్నాయి.  తమ అభిమాన హీరో సినిమా కోసం అభిమానులు భారీ ఎక్స్ పెక్ట్స్ పెట్టుకున్నప్పటికీ కొన్ని సినిమాలు సంక్రాంతి పండుగకి వచ్చి డిజాస్టర్ గా మిగిలాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

 1. మృగరాజు (2001 సంక్రాంతి)

Mrugaraju Songs - Dammento Choopincha Ro - Chiranjeevi Simran Sanghavi -  video Dailymotion

 మెగాస్టార్ చిరంజీవితో అప్పటికే చూడాలనివుంది సినిమాను గుణశేఖర్ తెరకెక్కించారు. ఆ తరువాత 2000 సంవత్సరంలో దర్శకుడు మృగరాజు  సినిమా కూడా రూపొందించారు. ఈ సినిమా విడుదలైన సమయంలో బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహనాయుడు సినిమా విడుదలైంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో.. మెగాస్టార్  మృగరాజు డిజాస్టర్ గా నిలిచింది. 

2.దేవిపుత్రుడు (2001 సంక్రాంతి)

Devi Putrudu Telugu Full Movie | Venkatesh | Anjala Zaveri | Soundarya |  Venkatesh Movies - YouTube

దేవిపుత్రుడు సినిమాతో విక్టరీ వెంకటేష్ సంక్రాంతి పండుగకి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా కూడా బాలయ్య నరసింహనాయుడు  సినిమాతో డిజాస్టర్ గా మిగిలింది. కాన్సేప్ట్ ఓరియెంటేడ్ మూవీ అయినప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన మేర ఆకట్టుకోలేదు. 

3. టక్కరి దొంగ (2002 సంక్రాంతి) 

Takkaridonga

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు జయంతి పరాన్జీ కాంబినేషన్ లో తెలుగులో కౌబాయ్ చిత్రాన్ని ప్రయత్నించారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. యావరేజ్ టాక్ తో 2002లో మహేష్ బాబు టక్కరి దొంగ డిజాస్టర్ గానే మిగిలింది. 

4. ఆంధ్రావాలా (2004 సంక్రాంతి) 

Manam News

యంగ్ ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఆంధ్రావాలా సినిమా వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. అంతకు ముందు సింహాద్రి సినిమాతో సూపర్ హిట్ సాధించిన ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాకి కూడా అదే స్థాయిలో హైప్ పెరిగింది. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలివచ్చారు. విడుదలైన తరువాత ఎన్టీఆర్ ఆంధ్రావాలా ఓ డిజాస్టర్ గా మిగిలింది. 

5. అంజి (2004 సంక్రాంతి) 

మెగాస్టార్ చిరంజీవి-కోడి రామకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అంజి. శివుడు, ఆత్మలింగం అన ఫాంటసీ కథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ కి మాత్రం నేషనల్ అవార్డు రావడం విశేషం. 

6. నా అల్లుడు (2005 సంక్రాంతి) 

Watch Naa Alludu Telugu Full- Movie Online HD - Junior NTR - NTR-MOVIES LIST

ఆంధ్రావాలా డిజాస్టర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ 2005 సంక్రాంతి పండుగకి నా అల్లుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నా అల్లుడు చిత్రాన్ని  దర్శకుడు వరా ముళ్లపూడి తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

7.చుక్కల్లో చంద్రుడు ( 2006 సంక్రాంతి) 

Manam News

అప్పటికే బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దానంటానా వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నారు సిద్ధార్థ్.  ఆ తరువాత వచ్చినటువంటి సిద్ధార్థ్  చుక్కల్లో చంద్రుడు సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో పాటలు మాత్రం ఆకట్టుకున్నప్పటికి సినిమా డిజాస్టర్ గానే మిగిలింది.

Advertisement

8. యోగి (2007 సంక్రాంతి) 

Venky Prabhas ™ on Twitter: "Intensity Eyes #Prabhas || #Yogi 🔥💥  https://t.co/mme3nuWazj" / Twitter

 

వర్షం తరువాత సంక్రాంతికి విడుదలైన ప్రభాస్ మూవీ యోగి. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చినటువంటి యోగి బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా కన్నడ సినిమా జోగికి రీమేక్. ప్రభాస్ నటన, వేణు మాధవ్ కామెడీ అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 

9. ఒక్కమగాడు (2008 సంక్రాంతి) 

Manam News

సంక్రాంతి హీరో అయినటువంటి బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు 2008 సంక్రాంతి పండుగకి విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడం గమనార్హం.

10. పరమ వీర చక్ర (2011 సంక్రాంతి )

 

Parama Veera Chakra Fan Photos | Parama Veera Chakra Photos, Images,  Pictures # 9223 - FilmiBeat

దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పరమవీరచక్ర. ఈ సినిమా బాలయ్యకి మరో సంక్రాంతి డిజాస్టర్ గా మిగిల్చింది.  రవితేజ నటించిన మిరపకాయ్ ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ గా నిలిచింది.

11. అనగనగా ఓ ధీరుడు (2011 సంక్రాంతి) 

Watch Anaganaga O Dheerudu Full HD Movie Online on ZEE5

 

సిద్ధార్థ్, శృతిహాసన్, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో కే.రాఘవేందర్ రావు కుమారుడు కె. ప్రకావ్ దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ ఫాంటసీ చిత్రం అనగనగా ఓ ధీరుడు. డిస్నీ సంస్థ నిర్మించిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ గానే మిగిలింది.

12.1-నేనొక్కడినే (2014 సంక్రాంతి) 

Manam News

సూపర్ స్టార్ మహేష్ బాబు-సుకుమార్ కాంబోలో వచ్చిన 1-నేనొక్కడినే చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ డిజాస్టర్ అయింది. 2011 సంక్రాంతి సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమా విజేతగా నిలిచింది.

13. డిక్టేటర్ (2016 సంక్రాంతి) 

Manam News

శ్రీవాస్ దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రం బాలకృష్ణ లిస్ట్ లో 2016 సంక్రాంతికి మరో డిజాస్టర్ గా మిగిలింది డిక్టేటర్. మొదటి మూడు రోజులు కలెక్షన్లు వచ్చినప్పటికీ ఆ తరువాత ఈ సినిమా థియేటర్లలో రాణించలేకపోయింది. 

Also Read :  సాయం చేయమని వేడుకుంటున్న మహేష్ బాబు డూప్ శీను..కారణం..!

14. అజ్ఞాతవాసి (2018 సంక్రాంతి) 

Agnyaathavaasi movie review: This film is strictly for Pawan Kalyan fans |  Entertainment News,The Indian Express

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అతిపెద్ద సంక్రాంతి డిజాస్టర్ ఏదైనా ఉందంటే.. అది అజ్ఞాతవాసి అనే చెప్పాలి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అజ్ఞాతవాసి చిత్రం భారీ హైప్ తో విడుదలైంది. కానీ ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. 

Also Read :  ఆరుగురు పతివ్రతలు’ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉందో..ఇప్పుడు ఆ పనులు చేస్తుందా ?

15. వినయ విధేయ రామ (2019 సంక్రాంతి) 

వినయ విధేయ రామ సినిమా ప్రివ్యూని చూసిన చిరంజీవి..రామ్ చరణ్ ఊరమాస్ హీరోఇజం| Vinaya  Vidheya Rama Movie - YouTube

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం వినయ విధేయ రామ. ఈ సినిమా 2019 సంక్రాంతి పండుగకి వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా డిజాస్టర్ మాత్రమే కాదు.. అత్యధికంగా ట్రోల్స్ చేయబడినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ నటించిన ఎఫ్ 2 సినిమాతో రామ్ వినయవిదేయ రామ చిత్రం తట్టుకోలేకపోయింది. 

Also Read :  “అక్కినేని ఫ్యామిలీ” పేర్ల‌కు ముందుగా నాగ అని ఎందుకు ఉంటుంది ? ఏదైనా శాపం ఉందా !

Visitors Are Also Reading