Home » ఫ్రెండని నమ్మి రూమ్ కి వెళ్తే.. మత్తుపానీయం ఇచ్చాడు..స్పృహలోకి రాగానే అంత అర్థమైంది..!!

ఫ్రెండని నమ్మి రూమ్ కి వెళ్తే.. మత్తుపానీయం ఇచ్చాడు..స్పృహలోకి రాగానే అంత అర్థమైంది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల.. స్నేహమేరా బతుకు బాటకు నీడనిచ్చే మల్లెల.. అన్నారు ఒక కవి.. దోస్త్ మేరా దోస్త్.. తూహీ మేరీ జాన్ అన్నారు మరో కవి.. ఈ విధంగా స్నేహబంధంపై ఇప్పటికే ఎంతోమంది కవులు పాటలు, కథలు రాశారు.. స్నేహం అంటే నమ్మకం, ప్రేమ కలగలిపి ఉంటాయి.. చాలామంది ఇంట్లో ఎవరితో చెప్పుకోలేని విషయాలు కూడా వారి స్నేహితులతో చెప్పుకుంటారు. అంటే స్నేహాన్ని వారు ఎంతలా నమ్ముతారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఒక యువకుడు, స్నేహితురాలిపై కన్నేసి చివరికి అంతా చేసి పారిపోయాడు.. అసలు జరిగిన విషయం ఏంటో మనం చూద్దాం..

Advertisement

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జైపూర్ పరిధికీ చెందినటువంటి ఒక 20 సంవత్సరాల యువతి స్థానికంగా ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంఐటి చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న ఒక విద్యార్థి ధీరజ్ శర్మతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఓకే కాలేజ్ కాబట్టి అతనితో క్లోజ్ గా మాట్లాడేది. ఈ క్రమంలోనే ధీరజ్ ఆ యువతిపై కన్నేశాడు. ఎలాగైనా లోబర్చుకోవాలి అనుకున్నాడు. అనుకున్న ప్రకారమే జూలై 31వ తేదీన పార్టీ ఉందని చెప్పి ఆ యువతిని పిలిచాడు. స్నేహితుడే కాబట్టి పిలిచిన వెంటనే ఆ యువతి అతని ఇంటికి వెళ్లింది.. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ప్లాన్ ప్రకారమే ఆ యువకుడు ఆ యువతికి మత్తుమందు కలిపి ఒక శీతల పానీయం తాగించాడు.

Advertisement

అది తాగిన వెంటనే ఆ యువతి సృహ తప్పి పోయింది. దీంతో ధీరజ్ తను ఏం చేయాలనుకున్నాడో అంతా కానీచ్చేసాడు. కొంత సమయం తర్వాత ఆ యువతి స్పృహలోకి వచ్చింది. జరిగిన విషయమంతా ఆమెకు అర్థమైపోయింది. దీంతో ధీరజ్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక బాధితురాలు ఏం చేయాలో అర్థం కాక సోమవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.. ఏది ఏమైనా స్నేహం పేరుతో నమ్మించి మోసం చేయడం అనేది స్నేహం అనే బంధానికి కళంకం తెచ్చినట్టే అంటున్నారు ఈ విషయం తెలిసిన కొంతమంది..

ALSO READ:

Visitors Are Also Reading