మహిళల టీ 20 ప్రపంచ కప్ 2023 నుంచి భారతజట్టు ఇంటిముఖం పట్టింది. కేప్ టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్ లో ఐదు పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు భారత్ అద్భుతంగా పోరాడనప్పటికీ ఓటమి మాత్రం తప్పలేదు. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ తో రాణించిన హర్మన్ వింత పద్ధతిలో అవుట్ అయింది. వేర్ హామ్ వేసిన బంతికి రెండు పరుగులు తీసేందుకు ఆమె ప్రయత్నించింది.
Advertisement
ఈ సమయంలో ఆమె పరుగు పూర్తి చేసినట్లే కనిపించింది. కానీ సరిగ్గా క్రీజు ముందు బ్యాట్ నేలపై పెట్టినప్పుడు, నేలలో దిగబడిన బ్యాటు ముందుకు చేరలేదు. దీంతో ఆమె రనౌట్ అయింది. కాగా హార్మన్ రనౌట్ ను 2019 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రనౌటుతో పోల్చుతూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. 2019 వన్డే ప్రపంచ కప్ లోను భారత్ ఈ విధంగానే సెమీస్ లో ఓటమిపాలైంది.
Advertisement
మంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ లో ధోని కూడా హర్మన్ లాగే దురదృష్టకర రీతిలో రనౌట్ అయ్యాడు. భారత్ విజయానికే 10 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో మార్టిన్ గుప్టిల్ డైరెక్ట్ త్రో ద్వారా ధోనీను పెవిలియన్ పంపాడు. దీంతో మ్యాచ్ కి కివిస్ వైపు మలుపు తిరిగింది. ఆ మ్యాచ్ లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
READ ALSO : తెలంగాణ గురుకుల నోటిఫికేషన్ లపై గుడ్ న్యూస్…పెరగనున్న పోస్టులు… ఎన్నంటే?