తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో… ఎవరు ఊహించలేరు. ఎప్పుడు ఏదో సంచలన నిర్ణయం తీసుకొని ప్రజల్లో నిత్యం ఉంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
READ ALSO : Adipurush Trailer : “ఆది పురుష్” ట్రైలర్ రిలీజ్…దుమ్ములేపిన ప్రభాస్
Advertisement
ఈ తరుణంలో తెలంగాణ మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ విషయంలో ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కు కీలక పదవి దక్కింది. అందరూ అనుకున్నట్టుగానే సీఎం కేసీఆర్ కు ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం మూడేళ్ల పాటు కొనసాగుతుందని సిఎస్ శాంతి కుమారి పేరుతో జీవో జారీ అయింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా ఏపీ క్యాడర్ కు వెళ్లిపోయారు సోమేశ్ కుమార్.
Advertisement
READ ALSO : KHUSHI : ఖుషి నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల… సమంత అదరగొట్టింది!
అయినా… క్యాడర్ అలాట్మెంట్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన… క్యాట్ కు వెళ్లారు. స్టే ఆర్డర్ తో తెలంగాణకు వచ్చారు. ఆ తర్వాత పలు పోస్టుల్లో పనిచేసిన సోమేశ్ సిఎస్ గా కూడా పనిచేశారు. ఫైనల్ గా హైకోర్టు సోమేశ్ పిటిషన్ ను కొట్టివేయడంతో ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తర్జన భర్జనల మధ్య ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వం సోమేశ్ కు ఎలాంటి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. అయితే కొద్ది రోజుల్లోనే విఆర్ఎస్ తీసుకొని సర్వీస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కు ప్రత్యేక సలహాదారునిగా నియమితులయ్యారు.
READ ALSO : IPL 2023 : చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. వివాదం సద్దుమణిగినట్టేనా?