మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు చాలాకాలం పాటు క్రికెట్ ఫ్యాన్స్ కి గుర్తుండిపోతుంది. ఎందుకంటే ధోని ఇచ్చిన ఇంపాక్ట్ ఆ రేంజ్ లో ఉంది. టీమ్ ఇండియాకు మూడు ఐసీసీ మెగా కప్పులు అందించిన ఏకైక కెప్టెన్ ధోని. ఇక ఆటగాడిగానే కాకుండా ఒక ఫ్రెండ్ గా ఇతర ప్లేయర్స్ తో ధోని ఉండే విధానం అతనికి మరింత క్రేజ్ తెచ్చింది. అభిమానులు కాకుండా క్రికెటర్లు కూడా ధోని అంటే చాలా ఇష్టపడతారు. ఇదే విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ మరోసారి తెలిపాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్గాన్ ధోనితో జరిగిన ఒక సరదా విషయాన్ని పంచుకున్నాడు.
2018లో ఆసియాకప్ లో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరిగిన తర్వాత కాసేపు ధోనితో మాట్లాడానని అస్గర్ అఫ్గాన్ తెలిపాడు. ఆ సమయంలో మా జట్టులో ఉన్న ఆటగాడు మహమ్మద్ గురించి ధోనీతో చెప్పానని తెలిపాడు. ధోనికి మహమ్మద్ పెద్ద ఫ్యాన్ అట. అతను లావుగా ఉంటాడని, భారీ ఖాయమని ధోని చెప్పాడు. దానికి ధోని సరదాగా అయితే అతన్ని 20 కేజీలు తగ్గమని ఐపీఎల్లో తీసుకుంటామని సరదాగా మాట్లాడాడని తెలిపాడు. ధోనితో మాట్లాడితే మంచి అనుభవం అని తెలిపాడు. ఆటగాళ్ళను మోటివేట్ చేయడంలో ధోని ముందు వరుసలో ఉంటాడని, అతను దొరకడం ఇండియా క్రికెట్ అదృష్టం అని చెప్పాడు.
Advertisement
Advertisement
2017 నుంచి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు మహమ్మద్ అజ్గర్ కెప్టెన్ గా వ్యవహరించారు. అతను ఆఫ్గనిస్తాన్ తరఫున ఆరు టెస్టులు, 114 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. ఇక తమ టీం ఎప్పుడు అద్భుతాలు చేస్తుందని తెలిపారు. వన్డేల్లో వరల్డ్ కప్ లో పెద్ద టీంకు సైతం షాక్ ఇచ్చి రికార్డు విజయాలు సాధిస్తున్నారు. అది చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందని అజ్గర్ అన్నాడు. ధోని పాత విషయాలు గుర్తు చేస్తూ అక్బర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ లో ఆడుతున్నాడు. వచ్చే 2024 ఐపీఎల్ సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.