ప్రస్తుతం దేశం మొత్తం ఒక్కే సినిమా గురించి మాట్లాడుకుంటుంది.. అదే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదల ముందు వరకు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ గురించి చర్చించుకున్న సినీ ప్రేక్షకులు.. ఇప్పుడు ఆ సినిమా గురించే మర్చిపోయారు. ఎక్కడ చూసిన అందరూ ఇప్పుడు కెజిఎఫ్ చాప్టర్ 2 పైనే మాట్లాడుతున్నారు.
Advertisement
అయితే ఈ సినిమా చాప్టర్ 1 విడుదల అయినప్పుడు.. దానిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే అది అంచనాలకు మించి విజయం సాధించిందో.. అప్పటి నుండి చాప్టర్ 2 కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు. ఇప్పుడు చాప్టర్ 2 కూడా విడుదలై అనుకున్న దానికంటే పెద్ద విజయం సాధించింది. ఇక ఈ సినిమా చూడక ముందు.. ఇందులో అంతలా ఏముంది అనుకునే వారు.. సినిమా చూసిన తర్వాత ఇందులో ఎంతో ఉంది అని అంటున్నారు. ఈ సినిమాను ఆ రేంజ్ లో తన శక్తి మొత్తం వడ్డి తీర్చిదిద్దాడు ప్రశాంత్ నీల్.
Advertisement
అలాగే కేజీఎఫ్ హీరో యాష్ కూడా తనలో ఉన్న మొత్తమ్ యాక్షన్ ను అలాగే సెంటిమెంట్ ను కూడా ఇందులో ఒక్కేసారి చూపించాడు. కానీ ఈ సినిమా ముగిసే సమయంలో కేజీఎఫ్ చాప్టర్ 3 ఉందనుకునేలా క్లైమాక్స్ ను ఇవ్వగా… అందుకు అవాక్ష్మే లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. డైరెక్టర్, హీరో ఇద్దరు తమలో ఉన్న బెస్ట్ ను ఇచ్చేసారు. కాబ్బటి చాప్టర్ 3 తీయాలనుకున్న.. అందులో చూపించడానికి ఏం మిగలలేదు. కాబట్టే చాప్టర్ 3 కి అవకాశం లేదు చెబుతున్నారు విశ్లేషకులు.
ఇవి కూడా చదవండి :
మారని ముంబై తీరు.. లక్నో విక్టరీ..!
టీంఇండియాకు కాబోయే కెప్టెన్ అతనే…?