Home » ఆ యాంకర్ చేసిన పనికి.. షో వదిలేసి వెళ్ళిన చిరు.. ఏం జరిగిందంటే..?

ఆ యాంకర్ చేసిన పనికి.. షో వదిలేసి వెళ్ళిన చిరు.. ఏం జరిగిందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. అంతటి స్టార్ హీరో మూవీ ఆచార్య ఈ మధ్యకాలంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిన విషయం అందరికి తెలిసిందే. అయితే చిరంజీవి మాత్రం చాలా మూవీస్ షూటింగ్స్ తో బిజీ గా ఉన్నారు. ఈ తరుణంలోనే ఆయన గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఆచార్య మూవీ డిజాస్టర్ తర్వాత చిరంజీవి తన భార్యతో కలిసి విదేశాలకు టూర్ వెళ్లారు.

Advertisement

దాదాపు నెల రోజుల పాటు అక్కడే గడిపి ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చేశారు . అయితే మరి కొద్ది రోజుల్లో మరొక సినిమా షూటింగ్ లో చిరంజీవి పాల్గొనబోతున్నారు. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి హీరోగా జూన్ 21వ తేదీన హైదరాబాదులో షూటింగ్ మొదలు కాబోతోంది.
ఈ తరుణంలోనే ఆయన ఒక షో కు చీఫ్ గెస్ట్ గా వెళ్లారనీ తెలుస్తోంది. ఆ షో షూటింగ్ జరుగుతున్న సమయంలో దానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి స్పాన్సర్ విషయంలో ఒక పేరును తప్పుగా పలికారని, దీనివల్ల చిరంజీవిని మరొకసారి రీటేక్ చేయమని వారు కోరారని తెలుస్తోంది.

Advertisement

దీంతో హర్ట్ అయినటువంటి చిరంజీవి ఆ షో మధ్య నుంచి వాకౌట్ అయ్యారని ఫిలిం వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అయితే ఆ షో ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ ఆ విషయం గురించి మాత్రం రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అధికారికంగా ఈ విషయం గురించి మాత్రం ఏమీ తెలియదు. అయితే ప్రస్తుతం చిరంజీవి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్, మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్, బాబు డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య అనే మూవీస్ ఉన్నాయి.

ALSO READ;

రాజ‌మౌళి సినిమాలో ఐశ్వ‌ర్య‌రాయ్‌..! ఈ క్రేజీ అప్‌డేట్ నిజ‌మేనా..?

నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

 

Visitors Are Also Reading