Home » వివాహాది శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు.. ఎప్పుడెప్పుడు అంటే..!

వివాహాది శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు.. ఎప్పుడెప్పుడు అంటే..!

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొంతకాలంగా వివాహాది శుభకార్యాలు కానీ ఇతర పండగలకు కానీ మంచి ముహూర్తాలు లేక చాలామంది శుభకార్యాలను పక్కన పెడుతూ వచ్చారు. కానీ ఈ డిసెంబర్లో శుభకార్యాలకు అనువైనటువంటి మంచి రోజులు బాగానే ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరి ఏడాది చివరి నెల కావడంతో మరి అద్భుత ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా పెళ్లిళ్లు చేసుకునేవారు అద్భుతమైన ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు..

Advertisement

also read:హన్సిక మామూలుది కాదు బాబోయ్.. హనీమూన్ ప్లాన్ అదిరిపోలా..!!

పుష్య మాసం, మాఘ మాసం పాల్గున మాసాలతో కలిపి ఈ నెలలో దాదాపుగా 63 పైగా ఉన్నట్లు పండితులు అంటున్నారు. డిసెంబర్ 3.4.7.8.9.14.17.18 తేదీలలో శుభముహూర్తాలు ఉండటంతో పురోహితులు ఈ ముహూర్తాలని ఫిక్స్ చేస్తున్నారు.. మూఢాల కారణంగా కార్తీకమాసంలో ఎక్కువగా ముహుర్తాలు దొరక్కపోవడం వల్ల చాలా ఇండ్లలో వివాహాది శుభకార్యాలకు వాయిదాలు పడ్డాయి. మార్గశిర మాసం నవంబర్ 24వ తేదీన స్టార్ట్ అయింది. అయినా డిసెంబర్ మూడో తేదీ ఏకాదశి నుండి మంచి ముహూర్తాలు ఉన్నాయని చాలామంది వారి యొక్క శుభకార్యాలను వాయిదాలు వేసుకుంటూ వచ్చారు.

Advertisement

ఇక డిసెంబర్ మూడో తేదీ నుండి మొదలు 2023 మార్చి 18వ తేదీ వరకు అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయట. ఏది ఏమైనా గత రెండేళ్లుగా కరోనా కారణంగా పెద్దగా ముహూర్తాలు లేకపోవడం, ఒకవేళ శుభకార్యాలు చేసుకున్న హడావిడిగా చేసుకోవడం, కరోనా సమయంలో పెళ్లిళ్లు చేసుకున్న వారు చాలా నిరాశ నిస్పృహలతో చేసుకున్నారు. కరోనా నుంచి కోలుకొని ఈ ఏడాది బయటపడ్డాం. ఇప్పుడిప్పుడే జనాలు మళ్ళీ శుభకార్యాలు అంగరంగ వైభవంగా సంతోషంగా బంధువులతో కలిసి చేసుకుంటున్నారు. అయితే కార్తీకమాసంలో ముహూర్తాలు లేకపోవడం డిసెంబర్ మొదలు అద్భుతమైన ముహూర్తాలు ఉండటంతో ఫంక్షన్ హాల్స్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

also read:

Visitors Are Also Reading