Home » BREAKING: ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కన్నుమూత

BREAKING: ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కన్నుమూత

by Bunty
Ad

క్రీడా రంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. బ్రెజిల్ ఫుట్ బాల్ దిగజం, స్టార్ ప్లేయర్ పీలే (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన సావోపాలో లోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పీలే మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. సాకర్ లెజెండ్ కన్నుమూయడంతో క్రీడాకారులు, ప్రముఖులు క్రీడాభిమానులు సంతాపం ప్రకటించారు.

Advertisement

Advertisement

కేన్సర్ బారిన పడ్డ పీలేకు గతేడాది సెప్టెంబర్ లో వైద్యులు కనితిని తొలగించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయనకు కీమోతెరపి అందిస్తుండగా, ఇటీవల పీలే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. పీలే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇంతలోనే ఆయన మరణ వార్త వినాల్సి వచ్చింది. కాగా, పీలే 1940 అక్టోబర్ 24న జన్మించారు. సాకార్ లో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. 16 ఏళ్ల వయసులో బ్రెజిల్ తరఫున అంతర్జాతీయ మ్యాచుల్లోకి అరంగేట్రం చేశాడు. ఇక ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

READ ALSO : Rishabh Pant : కారు యాక్సిడెంట్‌లో టీమిండియా క్రికెటర్ రిషబ్‌ పంత్‌కు గాయాలు

Visitors Are Also Reading