Home » న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసిన ఆహారం తీసుకుంటే.. ఇంత నష్టమా..?

న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసిన ఆహారం తీసుకుంటే.. ఇంత నష్టమా..?

by Sravya
Ad

మనం బయట ఏమైనా ఆహార పదార్థాలని కొనుక్కుంటే, న్యూస్ పేపర్ లో చుట్టి ఆహార పదార్థాలను ఇస్తూ ఉంటారు. బజ్జి, వడ ఇటువంటివన్నీ కూడా న్యూస్ పేపర్ లో కట్టేసి ఇస్తూ ఉంటారు. కానీ, నిజానికి ఇది చాలా ప్రమాదం. వేడివేడి ఆహార పదార్థాలను కానీ చల్లారిన ఆహార పదార్థాలను కానీ న్యూస్ పేపర్ లో పెట్టి ప్యాక్ చేయకూడదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని చెప్తోంది.

Advertisement

Advertisement

ఇలా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పేపర్లలో ఉపయోగించే ప్రింటింగ్ ఇంకులో హానికరమైన రసాలు ఉంటాయి. అవి ఆహార పదార్థాలకు అంటుకుంటుంటాయి. దాంతో ఆరోగ్యం పాడవుతుంది. తినుబండారాలను ప్యాక్ చేయడానికి ఎప్పుడూ కూడా న్యూస్ పేపర్ లని వాడకండి. ప్రింటింగ్ కి ఉపయోగించే
ఇన్క్ ఆహార పదార్థాలతో కలిసి వెళ్తుంది కదా.. అది ఆహారాన్ని కలుషితం చేస్తుంది. వెంటనే ఇది ప్రభావం చూపించకపోయినా తర్వాత పలు రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పు చేయకుండా చూసుకోవడం మంచిది.

Also read:

Visitors Are Also Reading