కారులో వేగంగా వెల్లేటప్పుడు బ్రేక్ ఫెయిల్ అయితే ఒక్కసారిగా డ్రైవర్ బయడిపోతాడు. ఆ తర్వాత కారులో ఉన్న ప్రయాణికులంతా టెన్షన్ పడతారు. ఇక అదే సమయంలో ఏవైనా వాహనాలు గానీ వ్యక్తులు గాని అడ్డువస్తే ప్రమాదం కూడా జరగొచ్చు. అయితే ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఓ మార్గం కూడా ఉంది. వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు కూడా బ్రేక్ ఫెయిల్ అయిన 10 సెకన్లలో కొన్ని పనులు చేయటం ద్వారా కారును ఆపవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Advertisement
1) ఇంజన్ బ్రేక్ ఫెయిల్ అయినా ఆందోళన చెందకూడదు. బ్రేక్ ఫెడల్ నాలుగైదు సార్లు వేస్తూ వదులుతూ వెంటవెంటనే తొక్కాలి. ఇలా చేయడం ద్వారా ఒక్కోసారి బ్రేక్ పని చేయవచ్చు.
2) మొదట పైన తెలుసుకుంది పని చేసినట్లైతే కారు స్పీడ్ గా వెళుతున్న సమయంలోనే హ్యాండ్ బ్రేక్ ను సగం వరకు పైకి లాగాలి. అలా చేయడం వల్ల వేగం సగానికి తగ్గిపోతుంది. హ్యాండ్ బ్రేక్ ఒకేసారి వేస్తే వాహనం అదుపుతప్పే ప్రమాదం ఉంటుంది.
3) ఒక వేళ హ్యాండ్ బ్రేక్ వేసిన వెంటనే కారు స్పీడ్ తగ్గకపోతే 4, 5, గెర్ల నుండి 2, 1 కి మార్చాలి. దాంతో కారు వేగం మరింత తగ్గుతుంది. ఇప్పుడు బ్రేక్ ను పూర్తిగా పైకి లేపాలి. అప్పుడు కారు పూర్తిగా ఆగిపోతుంది. ఇదంతా 5 నుండి 10 సెకన్లలో పూర్తి అవుతుంది.