సాధారణంగా నడుము సన్నగా ఉండాలని ఎవ్వరైనా కోరుకుంటారు. పెళ్ళి కాని వాళ్లే కాదు.. పెళ్లి అయిన వాళ్ళు కూడా కోరుకుంటారు. కానీ ఇప్పటి రోజుల్లో నడుము సన్నగా అవ్వాలన్నా.. బరువు తగ్గాలన్నా చాలా కష్టం అనే చెప్పాలి. కారణం రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చోవడం, ఫ్యాటీ ఫుడ్స్, జంక్, ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్తి తినడం. ఇలా తినేసి కూర్చోవడం కారణంగా.. నడుము భాగంలో, ఉదయం భాగంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది. ఆ తర్వాత దీన్ని తగ్గించుకోవడంలో కాన్సన్ ట్రేట్ పెట్టడం లేదు. దీంతో షేప్స్ అవుట్ అవుతున్నాయి. కొంత మంది అయితే పక్కకు తిరగడానికి, నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నాజూకైన నడుము కావాలంటే మాత్రం కింద చెప్పిన విధంగా క్రమం తప్పకుండా చేస్తే మాత్రం సన్నని నడుము మీ సొంతం అవ్వడం పక్కా.. ఇంకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి.
Advertisement
Advertisement
- నిటారుగా నిలబడి రెండు కాళ్ళను దూరంగా జరపాలి. లెఫ్ట్ హ్యాండ్ నడుము మీద ఆనించి.. ఇప్పుడు రైట్ మోకాలిని పైకి లేపాలి. ఆ తర్వాత కుడి మోచేతిని ఆనించాలి. ఇప్పుడు ఇలాగే లెఫ్ట్ మోకాలితోనూ చేయాలి. ఇలా రెండు వైపులా 20 సార్లు చేయాలి.
- కింద కూర్చొని రెండు కాళ్ళను పైకి లేపాలి. ఇప్పుడు చేతులను ఒకసారి లెఫ్ట్ వైపు, రెండోసారి రైట్ వైపు తిప్పాలి. ఇలా ఓ 30 సార్లు అయినా చేయాలి.
- వెళ్లకిలా పడుకుని కాళ్ళను మడిచి పాదాలను నేల మీద ఆనించాలి. ఆ తర్వాత మోచేతులను మడవాలి. నెక్స్ట్ మరో కాలిని స్ట్రైట్ గా ఉంచి మరో కాలిని మడవాలి. ఇప్పుడు మడతపెట్టిన కుడికాలును కుడి మోచేత్తో తాకాలి.
- ముందు నేలమీద కూర్చోవాలి. ఇప్పుడు రెండు లెగ్స్ ని కాస్త పైకి పెట్టాలి. ఇప్పుడు రెండు చేతులను పైకి లేపి, చేతులకు ఆనించి మోచేతుల వరకూ మడుచుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ ఉన్న కాలిని మడుచుకోవాలి. మడిచిన కాలిని మోచేత్తో తాకాలి. ఇప్పుడు ఇలాగే ఎడమ కాలిని చేయాలి.
- అంతే ఇలా బయటకు వెళ్లలేని వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడైనా ఇలా నడుము వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేస్తూ ఉంటే మీకు త్వరలోనే రిజల్ట్ కనిపిస్తాయి. వ్యాయామం చేస్తూనే తగిన డైట్ కూడా ఫాలో అవ్వాలి. లేదంటే ఫలితాలు సరిగ్గా రావు.