Telugu News » Blog » జుట్టు ఒత్తుగా రావాలంటే ఈ చిట్కాలను పాటించండి.. ఫలితం పక్కా..!

జుట్టు ఒత్తుగా రావాలంటే ఈ చిట్కాలను పాటించండి.. ఫలితం పక్కా..!

by Anji
Ads

సాధారణంగా ఎవరు అయినా కోరుకునేది పొడవాటి జుట్టు, తెల్లటి చర్మం అందంగా ఉండాలనుకుంటారు. అందంగా ఉండాలంటే జుట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. మన జుట్టు అందంగా ఉంటేనే మనం అందంగా కనిపిస్తూ ఉంటాం. జుట్టు నల్లగా, పొడవుగా, ఒత్తుగా ఉండాలని అందరూ అనుకుంటారు. మన ముఖానికి ఎంతో అందాన్ని జుట్టు పెరగడానికి కొన్ని జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

మన తలలో లక్ష నుంచి లక్షన్నర వెంట్రుకల వరకు ఉంటాయి. చాలామందికి జుట్టు ఒత్తుగా ఉంటుంది. కొందరి జుట్టు పలుచగా ఉంటుంది. అదేవిధంగా వెంట్రుకల ఆకారం.. పొడవు తలపై వెంట్రుకల సంఖ్య ఇలా అన్నీ కూడా మన జీన్స్ పై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఒక వెంట్రుక దాదాపు 99 గ్రాముల బరువు  మోయగలదట. వెంట్రుక కెరోటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతుంది కాబట్టి ప్రోటీన్ నిర్మాణం ఎక్కువగా ఉండటం వల్ల వెంట్రుకకు అంత గట్టిదనం ఏర్పడుతుంది. మనం చక్కని పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటుంటే జుట్టు కూడా అంత చక్కగా పెరుగుతుంటుంది. జుట్టు శుభ్రం చేసుకుంటూ.. ఒక్కసారి పుట్టిన వెంట్రుక ఐదు సంవత్సరాల వరకు ఊడిపోకుండా పెరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఉండిన వెంట్రుక స్థానంలో మళ్లీ కొత్త వెంట్రుకలు కూడా పుడుతుంటాయి. ఈ వెంట్రుక రావడానికి 20 వరకు రోజులు సమయం పడుతుంది. అయితే ఔషధ గుణాలు కలిగిన నూనెలు అప్లై చేసుకోవడం వల్ల ఈ కొత్త వెంట్రుకలు 15 రోజుల్లో మళ్ళీ మొలుస్తాయి. ఊడిన వెంట్రుక స్థానంలో 20 సార్లు కొత్త వెంట్రుకలు మొలుస్తాయి. 20 సార్లు తరువాత రాలిన వెంట్రుకల ప్లేస్ లో మళ్లీ వెంట్రుకలు రావు.

Advertisement

అనారోగ్య సమస్యలు కారణంగా వెంట్రుకలు రాలినప్పటికీ మన జీవన విధానాన్ని మార్చుకోవడం వల్ల వాటి  స్థానంలో మరల కొత్త జుట్టు వస్తుంది. అదేవిధంగా రోజుకు 50 నుంచి 150 వెంట్రుకలు సహజంగా ఊడిపోతుంటాయి. చాలామందికి వెంట్రుకలు ఊడిపోతే 50 వెంట్రుకలు మళ్ళీ వస్తాయి. ఇటువంటి వారు జుట్టు ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది. చాలామందిలో 100 వెంట్రుకలు రాలితే పోషకాహార లోపం ఇంప్లమేషన్ మూలంగా తిరిగి 50 వెంట్రుకలు మాత్రమే వస్తాయి. అదేవిధంగా రక్తహీనత, థైరాయిడ్ లాంటి సమస్యల వలన జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ ఉంటే ఆహారాలు శరీరంలో రక్తాన్ని పెంచే ఆహారాలు తీసుకోవడం సోయాబీన్స్, మిల్ మేకర్, ఆకుకూరలు, బాదంపప్పు ఎక్కువగా తీసుకోవడం వలన జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే మందార ఆకులను తీసుకుని వాటిని మెత్తని పేస్టులా చేసుకుని దాన్ని అప్లై చేసుకోవడం వలన కూడా జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే బృంగరాజ్ ఆకుల తైలాన్ని కూడా అప్లై చేసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. 

Advertisement

Also Read :   మీ పిల్లలు ఎత్తు పెరగాలంటే ఈ చిట్కా తప్పక పాటించండి..!