చాణక్య ఎన్నో విషయాల గురించి ప్రస్తావించారు. భార్యాభర్తల మధ్య బంధం గురించి కూడా చాణక్య అన్నారు భార్యాభర్తల మధ్య బంధం బాగుండాలంటే ఇవి కచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి సంబంధం కూడా ప్రేమ నమ్మకం మీద నిర్మించబడి ఉంటుంది ప్రతి ఒక్క ఒకరు కూడా ప్రేమ నమ్మకాన్ని జాగ్రత్తగా నిర్మూలించుకోవాలి. అలానే చాణక్య సూత్రాల ప్రకారం మధురంగా మాట్లాడటం చాలా ముఖ్యం. భార్య భర్తలు ఒకరితో ఒకరు మధురంగా మాట్లాడుకోవాలి. ప్రవర్తనలో సౌమ్యంగా ఉండే వ్యక్తిని అందరూ ప్రేమిస్తారు. అటువంటి జీవిత భాగస్వామి కావాలని అంతా కోరుకుంటారు. మధురమైన మాటలకి ఎంత కఠినమైన మనసు కూడా మారుతుంది. ప్రవర్తన ఎప్పుడూ కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడు భార్య భర్తల మధ్య బంధం బాగుంటుంది.
Advertisement
Advertisement
అలానే అహంకారం అసలు ఉండకూడదు. చాణక్య సూత్రాల ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా గర్వపడకూడదు. అహంకారం ఉండకూడదు. పరస్పర గౌరవం ఉన్నంతవరకు ఏదైనా సంబంధానికి గౌరవం ఉంటుంది. కాబట్టి గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం చాలా ముఖ్యం. సహనం కూడా ఉండాలి. సహనం ఉన్న వాళ్ళు అన్ని రకాల పరిస్థితుల్ని కూడా ఎదుర్కోగలుగుతారు. భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరినొకరు ప్రేమించుకోవడం ఒకరినొకరు గౌరవించుకోవడం మంచిది. అలానే సరైన కమ్యూనికేషన్ ఉండాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!