Telugu News » ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన ఆ ఐదుగురు స్టార్లు వీరే..!

ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన ఆ ఐదుగురు స్టార్లు వీరే..!

by Anji

చాలా వ‌ర‌కు ఎంతో కాలం ప్రేమించి పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. సీనీ ఇండ‌స్ట్రీలో కూడా ప‌లువురు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని ఆ త‌రువాత విడిపోయిన ఐదుగురు తెలుగు సినీ ప్ర‌ముఖుల జాబితా తెలుసుకుందాం.

Ads

సుమంత్‌- కీర్తిరెడ్డి

సుమంత్ పేరుగాంచిన తెలుగు న‌టుడు సుమంత్ కుమార్ యార్ల‌గ‌డ్డ గ‌తంలో న‌టి కీర్తిరెడ్డిని ప్రేమించారు. అయితే 2004లో వీరు వివాహం చేసుకున్నారు. ఈ జంట 2006లో ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. కీర్తిరెడ్డి ఆ త‌రువాత మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు యూఎస్ఏలో స్థిర‌ప‌డ్డారు. ఇద్ద‌రు పిల్ల‌లు క‌ల‌రు.

సిద్ధార్థ్‌- మేఘ‌న

సిద్దార్థ్ మేఘ‌న‌ను 2003లో వివామం చేసుకున్నారు. న్యూఢిల్లీలోని ఒక ప‌రిస‌ర ప్రాంతాన్ని పంచుకోవ‌డంతో వారు ఒక‌రికొక‌రు విడిపోయారు. త‌రువాత విడివిడిగా జీవితం ప్రారంభించి 2007లో విడాకులు తీసుకున్నారు ఈ జంట‌.

Also Read :  Bappi Lahiri: సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పి ల‌హిరి క‌న్నుమూత

ప‌వ‌న్ క‌ల్యాణ్ – రేణుదేశాయ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న చ‌ల‌న చిత్ర రంగ ప్ర‌వేశం త‌రువాత 1997లో మొద‌టిసారిగా నందినిని వివాహం చేసుకున్నారు. అత‌ను రేణుదేశాయ్‌తో లైవ్ ఇన్ రిలేష‌న్ షిఫ్ ప్రారంభించారు. 2007లో త‌న మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చి ఆ త‌రువాత 2012లో రేణుదేశాయ్‌కు కూడా విడాకులు ఇచ్చారు. ర‌ష్యాకు చెందిన అన్నా లెజ్నేవాతో మూడ‌వ పెళ్లి చేసుకున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

ప్ర‌కాశ్ కోవెల‌మూడి-క‌నికా ధిల్లాన్

ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు, నిర్మాత కే.రాఘ‌వేంద్ర‌రావు కుమారుడు ప్ర‌కాశ్ కోవెల‌మూడి ర‌చ‌యిత్రి స్క్రీన్ రైట‌ర్ క‌నికా ధిల్లాన్‌తో వివాహం జ‌రిగింది. ఇద్ద‌రూ ప్రేమ‌లో బాగా ఎంజాయ్ చేసిన త‌రువాత హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. 2017లో ప్ర‌కాశ్‌కు విడాకులు ఇచ్చి 2021లో హిమాన్షు శ‌ర్మ‌ను పెళ్లాడింది ధిల్లాన్‌.

నాగ‌చైత‌న్య‌- స‌మంత

నాగ‌చైత‌న్య‌-స‌మంతలు కొద్ది కాలం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా 2017లో వీరి వివాహం గోవాలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. 2010లో ఏమాయా చేశావే సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన వీరిద్ద‌రూ డేటింగ్ ప్రారంభించారు. 2017 అక్టోబ‌ర్‌లో హిందూ, క్రిస్టియ‌న్ సాంప్ర‌దాయం ప్ర‌కారం.. వీరు పెళ్లి చేసుకున్నారు. 2021 అదే అక్టోబ‌ర్ నెల‌లో వీరువురూ విడిపోతున్న‌ట్టు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Also Read :  స‌మ‌తామూర్తి సంద‌ర్శ‌న‌కు టికెట్‌.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ప్రేమ్ ఏర్పాటు


You may also like