Home » Shane Warne : షేన్ వార్న్ తీసిన టాప్‌-5 వికెట్లు చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

Shane Warne : షేన్ వార్న్ తీసిన టాప్‌-5 వికెట్లు చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

by Anji
Ad

ఆస్ట్రేలియా దిగ్గ‌జ లెగ్ స్పిన్న‌ర్ షేన్ వార్న్ (52) మృతి చెందాడ‌నే వార్తను యావ‌త్ ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ముఖ్య త‌మ అభిమాన క్రికెట‌ర్ లేని లోటు తీర్చ‌లేనిదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గింగిరాలు తిరుగుతూ లెగ్ సైడ్ అవ‌త‌లంగా ప‌డిన వార్న్ బంతి ఒక్క‌సారిగా దిశ‌ను మార్చుకుని వికెట్ల‌ను గిరాటేసిన ఘ‌ట‌న‌ల‌ను క్రికెట్ ప్ర‌పంచం ఎన్న‌టికీ మ‌రువ‌లేదు. ఈ క్రికెట్ చ‌రిత్ర‌లో షేన్ వార్న్ కెరీర్ లోని టాప్ -5 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఓ లుక్కేద్దాం.

Advertisement

ఇంగ్లాండ్‌తో టెస్ట్‌లో షేన్ వార్న్ త‌న అద్భుత‌మైన స్పిన్‌తో బ్యాట్స్‌మెన్ మైక్ గాట్టింగ్ నుంచి స‌మాధానం లేకుండా చేశాడు. లెగ్ స్టంప్‌న‌కు ఆవ‌ల ప‌డిన బంతి అనూహ్యంగా ఆఫ్ వికెట్‌ను తాకేసింది. బ్యాట్స్‌మెన్‌తో స‌హా ఆంఫైర్ కూడా ఆశ్చ‌ర్య‌పోవ‌డం విశేషం.

వెస్టిండీస్ కీల‌క ఆట‌గాడు, లెప్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్ చంద్ర‌పాల్‌కు వార్న్ సంధించిన ఓ బంతి మ‌హా అద్భుత‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. దూరంగా ప‌డిన బంతిని చంద్ర‌పాల్ అడ్డుకునేందుకు విఫ‌ల‌య‌త్నం చేశాడు. బాల్ భారీగా ట‌ర్న్ అయి లెగ్ వికెట్‌ను తాకింది.

Advertisement

 

  • ముఖ్యంగా హెర్షలీ గిబ్స్ క్రీజ్ లో ఉన్నాడంటే ఎంత‌టి బౌల‌ర్ అయినా హ‌డ‌లెత్తాల్సిందే. అలాంటి గిబ్స్‌ను వార్న్ త‌న సూప‌ర్ లెగ్ స్పిన్‌తో బోల్తా కొట్టించాడు. 1999 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో స్లో లెగ్ క‌ట్ట‌ర్ బంతికి గిబ్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

 

  • ఇక వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ పావెల్ మాత్రం వార్న్ బంతికి స‌మాధానం కూడా చెప్ప‌లేదు. ఆసీస్‌, విండీస్ మ‌ధ్య టెస్ట్ మ్యాచ్ సంద‌ర్భంగా లెగ్ ఆవ‌ల వేసిన బంతిని పావెల్ ఆడేందుకు య‌త్నించాడు. అయితే బ్యాట్‌కు బంతి తాక‌లేదు. వైడ్‌గా పోతుందేమోన‌ని భావించిన పావెల్‌కు షాక్ త‌గిలింది. బంతి గిర‌గిర తిరిగి అక‌స్మాత్తుగా ఠ‌క్‌మ‌ని వికెట్ల‌ను ప‌డేసింది.

 

  • ఇక ఈ సారి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అథెర్ట‌న్ వంతు. లెగ్ స్టంప్ ఇవ‌త‌ల బంతి ప‌డితే వ‌దిలేస్తే.. చాలు వికెట్ ప‌డిన‌ట్టే. అంత క‌చ్చితంగా షేన్‌వార్న్ సంధిస్తాడు. అథెర్ట‌న్ కూడానూ ఇలాగే బంతిని కొట్టేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు. ఇక వెన‌క్కి చూసుకోకుండానే వికెట్‌ను చేజార్చుకున్నాడు.

Also Read :  జ‌డ్డూ డ‌బుల్ సెంచ‌రీ మిస్‌.. ద్ర‌విడ్‌పై ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్‌..!

Visitors Are Also Reading