Home » తెలంగాణలో తొలి ఒమిక్రాన్ కేసు….!

తెలంగాణలో తొలి ఒమిక్రాన్ కేసు….!

by AJAY
Ad

తెలంగాణలో తొలి కరోనా ఒమిక్రాన్ కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ… తెలంగాణలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు చెప్పారు. విదేశాలనుండి వచ్చిన 325 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే అందులో 35ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని జీనోమ్ సీక్వెన్స్ కు నమూనాలు పంపించామని చెప్పారు.

First omicron case in Telangana

First omicron case in Telangana

ముప్పు త్వరలోనే వచ్చే ప్రమాదం ఉందని శ్రీనివాస్ రావు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా వేయాలని పోలీసు శాఖకు వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కచ్చితంగా మాస్క్ ధరించాలని బహిరంగ ప్రదేశాలు, ఆఫీసులలో కూడా మాస్కులు కచ్చితంగా ధరించాలని పేర్కొంది. వ్యాక్సిన్లు కచ్చితంగా వేసుకోవాలని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ పై కచ్చితమైన నిబంధనలు ప్రభుత్వం అనుమతితో రూపొందిస్తున్నామని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా వాక్సినేషన్ పత్రం ఖచ్చితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ లు వేసుకోని వారికి ఎక్కడికి వెళ్ళినా త్వరలో నో ఎంట్రీ తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది.

Advertisement

Advertisement

వాట్సాప్ యూజర్లకు షాక్..20 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్…!

ఇదిలా ఉండగా సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్ కారణంగా యువతకు ఎక్కువ ముప్పు అని చెబుతున్నారు. యువతలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో వైరస్ తీవ్రత అంతుచిక్కడం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంతేకాకుండా వైరస్ సోకిన వ్యక్తుల రోగ నిరోధక శక్తి వేగంగా తగ్గుతున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వ్యాక్సిన్లు వేసుకుంటేనే ఒమిక్రా న్ పై విజయం సాధించవచ్చని పేర్కొన్నారు.

Visitors Are Also Reading