Telugu News » Blog » మంటల్లో కాలిపోయిన 45 బీఎండబ్ల్యూ కార్లు…!

మంటల్లో కాలిపోయిన 45 బీఎండబ్ల్యూ కార్లు…!

by AJAY
Ads

కాస్ట్లీ కార్లలో ఎక్కువగా గుర్తుకు వచ్చే కారు బీఎండబ్ల్యు. ఈ కారుకు మార్కెట్ లో యమ క్రేజ్ ఉంటుంది. సంపన్నులు అంతా ఈ కార్లనే ఇష్టపడుతూ ఉంటారు. అయితే తాజాగా అలాంటి కాస్ట్లీ కారులు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. వివరాల్లోకి వెళితే….మహారాష్ట్ర లోని నవీ ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బీఎండబ్ల్యూ కార్ల గోడౌన్ లో మంటలు చెలరేగడం తో 45 కార్లు దగ్ధమయ్యాయి. మంగళవారం అర్థరాత్రి దాటిన తరవాత నవీ ముంబైలోని తుర్భే ఎంఐడిసీలోని డీ-207 కార్ల గోడాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఎంఐడిసీ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పారు.

Advertisement

Advertisement

Advertisement

అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఇక ఈ ఘటన కు గల కారణాలు తెలియలేదు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఈ ఘటన పై స్పందించిన గోదాం యాజమాన్యం….మంటల్లో 40 నుండి 45 కార్లు కాలిపోయాయి అని చెప్పారు. అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందిన వెంటనే వచ్చి 10 యంత్రాలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆరు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పారు.