అప్పట్లో పవన్ కల్యాణ్‌ను తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. మెగాస్టార్ తమ్ముడు అంటే ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలని అందుకోసం చాలా మంది దర్శకులను చెక్ చేసుకున్న తరువాత చివరికీ ఈదర వీర వెంకట సత్యనారాయణ (ఈవీవీ) కుదిరాడు.
Advertisement
ఇదిలా ఉంటే పవన్ పోస్టర్ డిజైన్ కూడా చాలా కొత్తగా చేశాడు ఈవీవీ.ఆ రోజుల్లోనే ఈవీవీ చేసిన ప్రమోషన్స్ చూసి అందరూ షాక్ కు గురయ్యారు. తొలుత పవన్ కల్యాణ్ ఉన్న ఫోటోలతో ఈ అబ్బాయి ఎవరూ అంటూ వాల్ పోస్టర్ సంధించారు. ఆ తరువాత సినిమా విడుదలకు ముందు ఇతడే మన పవన్ కల్యాణ్ అంటూ మరో పోస్టర్ విడుదల చేశారు. దీంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అంటా.. అని అంచనాలు కూడా పెరిగిపోయాయి.
Advertisement
అలా వచ్చింది అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి. ఇక ఒక పెద్ద ఈవెంట్‌ను జరిపి చిరంజీవి మెగాఫ్యాన్స్‌కు ఇతను నా తమ్ముడు అంటూ పరిచయం చేశాడు. ఈ పిక్‌లో చిరంజీవి పవన్ కల్యాణ్‌ను పరిచయం చేస్తూ పక్కనే మనకు నాగబాబు కూడా కనిపిస్తారు. ముఖ్యంగా ఈ సినిమాకు పవన్‌కల్యాణ్ తీసుకున్న పారితోషకం చాలా తక్కువ. సినిమా షూటింగ్ జరిగినన్నీ రోజులు నెలకు రూ.5వేలు ఇచ్చారట నిర్మాత అల్లు అరవింద్. అక్టోబర్ 11, 1996లో విడుదల అయిన ఈ సినిమా రికార్డులను సృష్టించింది. ఈ సినిమా 32 సెంటర్లలో 50 రోజులు, రెండు సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.
Also Read : సైకిల్ పై రామ్ చరణ్ సరికొత్త లుక్.. ఫోటో వైరల్..!