తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు సాయంత్రం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. మొత్తం 80,039 పోస్టులకు గాను తొలి విడుతగా 30,453 పోస్టుల భర్తీకి ఇవాళ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది.
Advertisement
Advertisement
గ్రూపు-1 503, పోలీస్ శాఖ టీఎస్ఎల్‌పీఆర్‌బీ 16,587, పోలీస్ శాఖ టీఎస్‌పీఎస్సీ 231, వైద్యారోగ్య శాఖ ఎంహెచ్ఎస్ఆర్బీ 10,028, వైద్యారోగ్యశాఖ టీఎస్‌పీఎస్సీ 2,662, వైద్యారోగ్యశాఖ డీఎస్సీ 45, జైళ్లశాఖ టీఎస్ఎల్పీఆర్‌బీ 154, జైళ్లశాఖ టీఎస్‌పీఎస్సీ 31, రవాణాశాఖ టీఎస్‌పీఎస్సీ 149, రవాణాశాఖ టీఎస్ఎల్‌పీఆర్‌బీ 63 పోస్టులతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకుసైతం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ తరుణంలో సంబంధిత శాఖల్లో భర్తీ ప్రక్రియను నియామక సంస్థలు చేపట్టనున్నాయి. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆయా శాఖల మంత్రులు, ఆయా శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేయనుంది.