Home » తెలంగాణలో 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి

తెలంగాణలో 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి

by Anji
Ad

తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారో అని ఎంతో మంది ఆశతో ఉన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నప్పటికీ కేవలం 9168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.

Advertisement

డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా వీటిని భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ నవంబర్ 25, 2022న ఉత్తర్వులను జారీ చేసింది. 25 డిపార్టుమెంట్ లలోని 91 విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు పురపాలక శాఖలో 1,862 వార్డు అధికారుల పోస్టులు, ఆర్థిక శాఖ, పురపాలక శాఖలో 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, ఆడిట్ శాఖలో 18 మంది జూనియర్ ఆడిటర్ల నియమానికి ఆర్థికశాఖ అనుమతించింది. 

Advertisement

ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వీలుగా సంబంధిత శాఖల వివరాలు, అర్హతలు, రోస్టర్ పాయింట్లు, లోకల్ క్యాడర్ వంటి వివరాలను టీఎస్పీఎస్సీకి అందించాలని సూచించారు. ఇక ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆర్థిక శాఖ ఉత్తర్వులను మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఆశావాహులకు శుభాకాంక్షలు తెలిపారు. 

Also Read :   కాంతారావు గురించి కూతురు సుశీల ఏమన్నారో తెలుసా ?

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు శాఖల వారిగా.. 

రెవెన్యూ 2,077, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి  1,245, ఉన్నత విద్య 742, పురపాలక, పట్టణాభివృద్ధి 601, ఎస్సీ సంక్షేమం 474, వైద్య, ఆరోగ్య 338, బీసీ సంక్షేమం 307, గిరిజన సంక్షేమం 221, మైనార్టీ సంక్షేమం 191, హోం 133,  కార్మిక, ఉపాధి శిక్షణ 128, పాఠశాల విద్య 97, పౌర సరఫరాలు 72, నీటి పారుదల 51, ఆర్థిక 46, వ్యవసాయం 44, అడవులు, పర్యావరణం 23, రవాణా ఆర్ అండ్ బీ 20, మహిళా, శిశు సంక్షేమం 18, యువజన పర్యాటక, సాంస్కృతిక శాఖలో 13, పరిశ్రమలు 7, సాధారణ పరిపాలన 5, విద్యుత్ 2, ప్రణాళిక శాఖ 2, పశుసంవర్ధక శాఖలో 2  జూనియర్ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.

Also Read :  క‌మ‌ల్ హాస‌న్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సారిక‌తో ఎందుకు విడిపోయారు..?

Visitors Are Also Reading