Telugu News » Blog » అంత్యక్రియలకు కార్పొ”రేటు” కల్చర్… ఆ నలుగురు ఇక వాళ్ళే…!

అంత్యక్రియలకు కార్పొ”రేటు” కల్చర్… ఆ నలుగురు ఇక వాళ్ళే…!

by AJAY
Ads

ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ఓ వాణిజ్యాలకు సంబంధించిన ఓ మేళా జరుగుతూవుంది,. అందులో ఓ వినూత్నమై, నూతన కార్పొరేట్ సంస్ధ వ్యాపారకార్యకలాపాల స్టాల్ అందరినీ ఆకర్షించింది.. ఒకింత ఆలోచింప చేస్తుంది,. కాదేది వ్యాపారానికి అనర్హం అని తెలియచేసింది,..

Advertisement

అదేంటంటే వారు ప్రారంభించిన సరికొత్త కార్పొరేటు వ్యాపారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయడం. అందులో సభ్యత్వం కోసం రుసుముగా ₹37,500 కట్టాలి.. ఇక మీరు సభ్యులైనట్లే.. ఇక మీరు విదేశాలలో కాలుమీద కాలేసుకుని డబ్బులు సంపాదించుకుంచు ఉండచ్చు,,, మీ తల్లితండ్రులు ఎవరైనా చనిపోతే మీరు అంత్యక్రియలకోసం మనదేశానికి హుటాహుటిన రానవసరము లేదు… శవాన్ని ఫ్రీజరులో పెట్టి మీరొచ్చి అంత్యక్రియలు చేస్తారని మీకోసం వేచిచూడాల్సిన అవసరము లేదు…

Advertisement

ఎందుకంటే అంత్యక్రియలకు కావలసిన ఆ నలుగురూ కూడా ఆ కార్పొరేట్ కంపెనీ చూసుకుంటాది,.. అంతేకాదు గోవింద గోవింద, రామ్ నామ్ సత్యహై అని దారిపొడుగునా అరిచేకి, ఏడ్చేకి, పాడెమోసేకి, కాల్చేది ఆ కంపెనీ మనుషులే చూసుకుంటారు,… ఆగండాగండి శవాన్ని కాలిస్తే అయిపోతదా? మరి బూడిదో దానిని గంగలో కలపద్దా? అంటే దానికి సై సై అనింది కంపెనీ,, ఓ గంగానదేం ఖర్మ మీరు రిజిష్టరు చేసిన ఏ నదిలోనైనా కలుపుతాం అంది,,.

తమది కొత్త స్టార్టప్‌ కంపెనీ అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఇప్పటివరకు ఈ కంపెనీ 50 లక్షల లాభాలను ఆర్జించింది. రాబోయే కాలంలో దీని టర్నోవర్ 2000 కోట్లుగా ఉంటుందని అంచనా.

Advertisement

భారతదేశంలో వచ్చిన నయా కొత్త సంస్కృతి. బహుశా కోవిడ్ లో శవాలు కాల్చేసిన అనుభవం తో పెట్టారేమో,,, ఎందుకంటే కోవిడ్ లో మనం పాటించలేదుగా..ఇప్పటి వరకు 5000 మంది అంత్యక్రియలు జరిగాయి.. ఇది అన్ని దేశాలలో, అన్ని ఊర్లలో వేరు వేరు రూపాలలో ఉంది,.. ఇది అడ్వాన్సుడు వెర్షన్,, ఇక రిలయన్సు కంపెనీ దిగడమే ఆలస్యం…

ఈ విధానం ఎందుకంటే ఇండియాలో రిలేషన్ షిప్ మెయింటైన్ చేసుకునేందుకు కొడుకుకి గానీ,కూతురుకుగానీ, తమ్ముడికి గానీ మిగతావారికి గాని సమయం లేదని కంపెనీకి తెలుసు. మనం న్యూక్లియారు ఫ్యామీలు అయ్యాం,. డబ్బులకే విలువనిస్తున్నాం.. మానవసంబంధాలకు విలువనీయం,, ఉన్నతంగా జీవించడం అంటే విలువలతో జీవించడమే అని ధనవంతుడుగా జీవించడం కాదని మనం మరిచిపోయాం,,

ఎంత ఎక్కువగా డబ్బు ఉంటే అంత గొప్ప అనుకుంటాం.. స్ధలాలు పొలాలు ఎస్టేటులు కొంటాం.. కాని మనం చనిపోయినపుడు స్మశానంలోనే కాల్చేశారు.. ఆ ఎస్టేటులో కాల్చి స్మారకము కట్టకపోవడం చాలా సినిమా మహోన్నతులకు, రాజకీయ నాయకులకు జరిగింది… కొత్త విధానంలో అంత్యక్రియలు కూడా ఎవరో చేస్తారు,. ఎవరో పిండంపెడతారు.. ఎవరో బూడిద గంగలో కలుపుతారు,, అది నిజమో అపద్ధమో తెలియదు.. నిజమనుకొని జీవిస్తాము,, అపద్ధాన్ని ఊహించే శక్తి మనకు లేదు.,, మెటీరియలిజం యొక్క అధునాతన జీవనవిధానశైలి,..

సనాతన ధర్మాలు, హిందూ జీవన విధానాలలోమిగిలిన ఆఖరు లింకు ఇదే.,. దీని తరువాత ఏ నియమాలను పాటించాల్సిన అవసరమూ లేదు.. మనకు కన్వీనియంటుగా ఉండే ఇజం.. డబ్బులు అనే మనీయిజం మనముందు సాక్షాత్కరిస్తుంది,. తల్లితండ్రులు అంటే ఓల్డు మాడల్.. వారికేం తెలియదు.. మనకు డబ్బులు సంపాదించకలుగుతానే ప్రపంచమంతా మనకే తెలుసు అనే కొత్త సమాజం ఆవిష్కరణ జరుగుతోంది,.. పాశ్చాత్య నాగరికత మనలోకి దూరిపోయింది,. చూద్దాం ఏం జరుగుతుందో? 5000 సంవత్సరాల సనాతనధర్మం మన హిందూనాగరికత బతికి బట్టకడతాదా? లేక పాశ్చాత్య నాగరికత లో ఇమిడిపోతాదా? లేక పాశ్చాత్య నాగరికత నే మనదానిలో కలిసిపోయి కొత్త నాగరికత వస్తాదా? అనేది మనకు కాలమే తెలుపాల.. మీరేమంటారు….

Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.